పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’తో పోటీ పడనున్న నాని(Nani) ‘దసరా’!

Updated on Aug 26, 2022 06:50 PM IST
పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​Pawan Kalyan) తో పోటీపడనున్న నేచురల్​ స్టార్​ నాని(Nani)
పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​Pawan Kalyan) తో పోటీపడనున్న నేచురల్​ స్టార్​ నాని(Nani)

టాలీవుడ్​లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నేచురల్ స్టార్ నాని(Nani)కి మంచి అనుబంధం ఉంది. చాలా విషయాల్లో ఈ ఇద్దరు హీరోల అభిప్రాయాలు కలవడం, నాని తెలుగు సినిమా సమస్యలపై బలంగా నిలబడడంతో పవన్ కల్యాణ్ కూడా సపోర్ట్​గా నిలిచారు.

ఇటీవల నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కి కూడా హాజరయ్యారు పవన్. మరి ఇలాంటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు సినిమా పరంగా పోటీ జరగబోతోందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ కూడా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు అందులోని ఇద్దరు కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరి వాటిలో పవన్ హరిహర వీరమల్లు చేస్తుండగా నాని దసరా అనే మాస్ డ్రామా చేస్తున్నాడు.

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​Pawan Kalyan) తో పోటీపడనున్న నేచురల్​ స్టార్​ నాని(Nani)

పవన్​కి పోటీగా నాని..

నాని నటిస్తున్న దసరా సినిమా రిలీజ్ డేట్​ని చిత్ర బృందం అనౌన్స్ చేసి షాకిచ్చింది. ఈ చిత్రాన్ని 2023లో మార్చ్ 30న భారీగా రిలీజ్ చేస్తునట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ తేదీనే పవన్ హరిహర వీరమల్లు కూడా రిలీజ్ చేసే ప్లాన్​లో ఉన్నామని ఆ సినిమా నిర్మాత ఇటీవలే ప్రకటించారు.

దీనితో ఒక్కసారిగా హరిహర వీరమల్లు రిలీజ్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇదే డేట్​ని నాని సినిమాకి ఫిక్స్ అవ్వడంతో పరిస్థితి మరింత ఆసక్తిగా మారింది. ఒకేరోజున ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్​ అవడం మామూలే. అయితే ఈ పోటీ కాస్త స్టార్​ హీరోల మధ్య అయితే సినిమాల ఫలితంపై ఆ ప్రభావం తప్పదు.  మరి పవన్(Pawan Kalyan), నాని(Nani) దసరా సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2023 మార్చి వరకు వేచి చూడక తప్పదు.

Read More : కామన్ మ్యాన్ నుంచి నేచురల్ స్టార్ వరకు 'ఓ సుదీర్ఘ ప్రయాణం'.. నాని (Nani) నటించిన టాప్‌ టెన్ సినిమాలు ఇవే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!