బాక్సాఫీస్ దగ్గర ‘సర్దార్’ (Sardar), ‘ఓరి దేవుడా’ (Ori Devuda) మూవీల హవా.. రేసులో వెనుకపడిన ‘జిన్నా’ (Ginna)

Updated on Oct 22, 2022 05:54 PM IST
పాజిటివ్ టాక్ రావడంతో ‘సర్దార్’ (Sardar), ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రాలు కలెక్షన్లలో హవా చూపిస్తున్నాయి
పాజిటివ్ టాక్ రావడంతో ‘సర్దార్’ (Sardar), ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రాలు కలెక్షన్లలో హవా చూపిస్తున్నాయి

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. బాగున్న మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆడియెన్స్ తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ వారం కూడా నాలుగు చిత్రాలు బరిలోకి దిగాయి. దీపావళి పండుగతోపాటు లాంగ్ వీకెండ్ కలిసొస్తుండటంతో ఒకేసారి ఇన్ని సినిమాలు రేసులోకి దిగాయి. వీటిలో కోలీవుడ్ స్టార్ కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar) డబ్బింగ్ మూవీ కాగా.. మరో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) యాక్ట్ చేసిన ‘ప్రిన్స్’ (Prince) బైలింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కింది. దీనికి ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. 

డబ్బింగ్ సినిమాకు మంచి ఓపెనింగ్స్

మాస్ కా దాస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda), మంచు విష్ణు (Vishnu Manchu) యాక్ట్ చేసిన ‘జిన్నా’ (Ginna) సినిమాలు కూడా దీపావళి రేసులో పోటీపడ్డాయి. వీటిలో ఒక్క ‘జిన్నా’ తప్పితే మిగతా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శననే కనబర్చాయి. ‘సర్దార్’, ‘ప్రిన్స్’, ‘ఓరి దేవుడా’ చిత్రాలు మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. కార్తి నటించిన ‘సర్దార్’ మూవీ తొలి రోజు రూ.1.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఫస్ట్ డే ఇది చాలా పెద్ద రెవెన్యూ కిందే లెక్క. అలాగే విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన ‘ఓరి దేవుడా’ రూ.98 లక్షలు వసూలు చేసింది. ఓ చిన్న సినిమాకు ఇది మంచి రెవెన్యూ అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

పుంజుకోకపోతే ‘జిన్నా’కు కష్టమే

శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ మూవీ తొలి రోజు మోస్తరు ప్రదర్శనను చేసింది. ఈ సినిమా రూ.95 లక్షలు కలెక్ట్ చేసింది. అయితే అందరికన్నా తక్కువ వసూళ్లు సాధించిన ఫిల్మ్ ‘జిన్నా’. ఈ మూవీ వసూళ్లు రూ.10 లక్షల్లోపేనని ట్రేడ్ టాక్. కలెక్షన్స్ విషయంలో ‘జిన్నా’ బాగా పుంజుకోవాలి.. లేకపోతే సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇక, ‘సర్దార్’, ‘ఓరి దేవుడా’ ఇదే రన్‌ను కొనసాగించాలి. పాజిటివ్ టాక్ రావడం ఈ రెండు సినిమాలకు కలిసొచ్చే అంశం. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ వసూళ్లు వేగం పుంజుకోవాల్సి ఉంది. ఈ సినిమా కొంచెం భారీ టార్గెట్‌ను పెట్టుకునే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి, ఈ చిత్రాలన్నీ దీపావళి ముగిసేసరికి సక్సెస్‌ఫుల్ సినిమాల లిస్టులో చేరతాయేమో చూడాలి. 

Read more: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంచలన మూవీ ‘కాంతార’ (Kantara)!.. ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!