'ప్రిన్స్' (Prince)ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివకార్తికేయన్ పై విజయ్ దేవరకొండ (VijayDeverakonda)ఎమోషనల్ కామెంట్స్!

Published on Oct 20, 2022 12:42 PM IST

'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవి (Anudeeop KV) దర్వకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమా 'ప్రిన్స్' (Prince). దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్టేజి పై హీరో శివకార్తికేయన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. 

సాధారణ టీవీ ఆర్టిస్ట్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ గా ఎదిగిన శివకార్తికేయన్ (Siva Karthikeyan) జర్నీ తనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుందని అన్నారు. అయితే, శివకార్తికేయన్ ను ఎప్పటినుంచో కలవాలనుకున్నాననీ.. అది ఈరోజు కుదిరిందని అన్నారు. ఓ సందర్భంలో శివకార్తికేయన్ స్టేజి పై కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన తనకి ఇంకా గుర్తుందని పేర్కొన్నారు. అప్పుడు మేమంతా సినిమా వాళ్లం.. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి కదా అని అనిపించిందని ఎమోషన్ అయ్యారు.

డైరెక్టర్ అనుదీప్ గురించి మాట్లాడుతూ.. తనకు బోర్‌ కొడితే అనుదీప్‌ తీసిన వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తుంటానని.. అవి ఎంతో ఫన్నీ గా ఉంటాయని చెప్పుకొచ్చారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా సమయంలో నాగ్ అశ్విన్ అనుదీప్ గురించి చెప్పేవారని అన్నారు. తనకు ముందు నుంచీ పరిచయం ఉన్న వ్యక్తిలా అనుదీప్ కనిపిస్తారని అన్నారు విజయ్.  

Read More: Biggboss Season 6 : బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పడ్డారు.. కంటెస్టెంట్లకు తిండి కష్టాలు.. ఫుడ్ కోసం తిప్పలు!