క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel).. ‘ఊర్వశివో.. రాక్షసివో’ టాక్‌తో క్యూ కడతున్న అవకాశాలు

Updated on Nov 09, 2022 10:52 PM IST
అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది
అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది

ఒక్క ఛాన్స్​ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్​( Anu Emmanuel).  నేచురల్​ స్టార్‌‌ నాని నటించిన ‘మజ్ను’తో టాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ భామకు తర్వాత చెప్పుకోదగ్గ హిట్​ ఒక్కటీ లేదు.​

స్టార్​ హీరోలైన పవన్ ​కల్యాణ్​, అల్లు అర్జున్​ సరసన నటించినా అనుకి అనుకున్నంత క్రేజ్​ రాలేదు. అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా సక్సెస్ కావడంతో  ప్రస్తుతం అను హాట్​ టాపిక్​గా మారింది. ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంటోందని తెలుస్తోంది.

తెలుగులో కొన్ని సినిమాలకు కమిట్ అవుతూనే కోలీవుడ్‌లోనూ ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా ఈ భామ తమిళ స్టార్ హీరో కార్తీ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు ‘జపాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో అను పాల్గొనడంతో తనే  హీరోయిన్ అని తేలిపోయింది.

అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది

బాలనటిగా ఎంట్రీ..

అనూ ఇమ్మాన్యుయేల్ 1997 మార్చి 28న అమెరికాలో జన్మించింది. ఆమె బాల్యమంతా డల్లాస్ లోనే గడిచింది. అను పాఠశాలలో చదువుతుండగానే ‘స్వప్నవిహారి’ అనే సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత స్టడీస్ పై దృష్టి పెట్టిన ఈ సుందరి తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.

ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకున్నా అనుకు అవకాశాలు తలుపు తట్టాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో అవకాశం తెచ్చుకుంది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఆమె కెరీర్ కు పుల్‌స్టాప్ పడినట్లేనని అనుకున్నారు.

కానీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన ‘అజ్ఞాత వాసి’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది

కార్తి పక్కన మరోసారి..

ఇటీవల అను, అల్లు శిరీష్ కి జోడీగా ‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమాలో అలరించింది. ఈ సినిమాలో అందచందాలను ఆరబోస్తూ కాస్త కెమెస్ట్రీ పండించడంలో అనూ సక్సెస్ సాధించింది. దీంతో ఈ భామ కోసం కొందరు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఆమె నటనకు ఫిదా అయినా తమిళ డైరెక్టర్.. కార్తీ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామ ‘జపాన్’ సినిమాతో తమిళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

గతంలో ‘తుప్పారివాలన్’, ‘నమ్మవీట్టు పిల్లై’ అనే తమిళ సినిమాల్లో అను అవకాశాలు తెచ్చుకుంది. కానీ తాజాగా స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రావడంతో అను(Anu Emmanuel) కెరీర్ ఇక మలుపు తిరిగినట్లేనని సంబరపడుతున్నారు అభిమానులు.

Read More : రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఊర్వశివో రాక్షసివో’! నిజమేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!