ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంచలన మూవీ ‘కాంతార’ (Kantara)!.. ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

Updated on Oct 22, 2022 12:29 PM IST
‘కాంతార’ (Kantara) కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఓటీటీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతుందని సమాచారం
‘కాంతార’ (Kantara) కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఓటీటీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతుందని సమాచారం

భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు నిరాశపర్చడం సాధారణంగా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజై బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టే చిత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇది అరుదుగా జరుగుతుంది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా, పరిచయం లేని హీరో, హీరోయిన్లతో భారీ హిట్లు కొట్టడం అంత సులువు కాదు. కానీ మౌత్ పబ్లిసిటీతో ఇది సాధ్యమేనని ‘కాంతార’ (Kantara) మూవీ నిరూపించింది. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ ఫిల్మ్.. ఇవాళ దేశం మొత్తం చర్చించుకునేలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా ‘కాంతార’ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. కథ పరంగా అంతగా కొత్తదనం లేకపోయినా కట్టిపడేసే కథనం, ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్, నటీనటుల సహజమైన నటన.. అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో బిగ్ స్క్రీన్స్‌పై ‘కాంతార’ మ్యాజిక్ చేస్తోంది. అడవి నేపథ్యంలో కథను అల్లుకుని.. అందరూ మర్చిపోతున్న నేటివిటీ, సంస్కృతి, సంప్రదాయాల మిళితంగా ఈ సినిమాను హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హృద్యంగా తెరకెక్కించిన తీరుపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. 

థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తున్న ‘కాంతార’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే కొద్ది రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా పలకరించనుందని తెలిసింది. ‘కాంతార’ (Kantara OTT) ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో దక్కించుకుందట. నవంబర్ 4న ఈ ఫిల్మ్‌ను అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంచుతారని సమాచారం. తొలుత కన్నడ వెర్షన్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో తెలుగు, మలయాళం, హిందీ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొస్తారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

‘కాంతార’ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మరో విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేసిన నిర్మాత అల్లు అరవింద్‌కు సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఓటీటీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్‌తో కలసి ‘ఆహా’ (aha) పంచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈవిధంగానే జీ5తోపాటు హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ అయ్యింది. ‘కాంతార’ను కూడా ఇదే విధంగా ‘ఆహా’, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా రిలీజ్ చేస్తాయోమో చూడాలి. 

Read more: ‘కాంతార’ (Kantara)లోని ఆ శబ్దాన్ని దయచేసి అనుకరించొద్దు.. ప్రేక్షకులకు రిషబ్ శెట్టి (Rishab Shetty) విజ్ఞప్తి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!