సెన్సార్ పనులు పూర్తి చేసుకొని 'A' సర్టిఫికెట్ పొందిన ‘హిట్ 2’ (Hit 2).. సినిమా రన్ టైమ్ ఎంతంటే..?

Updated on Nov 26, 2022 03:57 PM IST
తాజాగా ‘హిట్ 2’ (Hit 2) మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దీనికి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు.
తాజాగా ‘హిట్ 2’ (Hit 2) మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దీనికి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘హిట్ 2’ (Hit 2). దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ తిపిరినేనితో కలిసి హీరో నాని నిర్మించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్: ది ఫస్ట్ కేస్ ’ ఒకటి. విశ్వక్‌సేన్‌ (Vishwaksen) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా శైలేష్‌కు డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను చివరి వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. మరోవైపు.. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా నానికి భారీ హిట్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండేళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కింది.

తాజాగా ‘హిట్ 2’ (Hit 2) మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ చిత్రంలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఈ సినిమాకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుందని దర్శక నిర్మాతలు ముందే ఊహించారు. 

యూట్యూబ్ లో ‘హిట్ 2’ (Hit 2 Trailer) ట్రైలర్ విడుదలైనప్పుడే అందులోని కంటెంట్ కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. 18 సంవత్సరాల పైబడిన వారే దీన్ని చూడాలని హెచ్చరికతో తిరిగి స్ట్రీమింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాకు కూడా అదే నియమాన్ని వర్తింపచేస్తూ సెన్సార్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

కాగా ఈ సినిమా రన్‌టైం (Hit2 RunTime) రెండు గంటలు ఉండనుంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ రన్‌టైంతో ఏ సినిమా రాలేదు. థ్రిల్లర్‌ సినిమాలకు ఈ రన్‌టైం ఉంటే చాలా వరకు ప్లస్‌ అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనుంది. ఇక, ఈ సినిమాలో రావురమేష్‌, కోమలి ప్రసాద్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read More: Hit 2 Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా సన్నివేశాలు.. ఆసక్తి రేపుతున్న అడివి శేష్ (Adivi Sesh) ‘హిట్ 2’ ట్రైలర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!