'సర్దార్' (Sardar) తర్వాత కార్తీ (Hero Karthi) తర్వాతి సినిమా ‘జపాన్’.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

Updated on Nov 09, 2022 06:14 PM IST
'సర్దార్' (Sardar) తర్వాత కార్తీ తన కెరీర్ లో 25వ సినిమాని తాజాగా అనౌన్స్ చేశారు.
'సర్దార్' (Sardar) తర్వాత కార్తీ తన కెరీర్ లో 25వ సినిమాని తాజాగా అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ ప్రేక్షకుల్లో కోలీవుడ్ హీరోలకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ కార్తీ (Hero Karthi) గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలగడంతో ఇక్కడి వారికి కార్తీ మరింత దగ్గరయ్యారు. దీంతో కార్తీ మార్కెట్ టాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. 

ఇదిలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" (Sardar) మూవీలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఇక, ఇందులో కార్తీ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో కార్తీ స్పై ఏజెంట్ గా కనిపించగా ,  మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు.

'సర్దార్' (Sardar) తర్వాత కార్తీ తన కెరీర్ లో 25వ సినిమాని తాజాగా అనౌన్స్ చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘జపాన్’ (Japan Movie) అనే టైటిల్ ని నిర్ణయించారు. శకుని, కాష్మోరా, ఖాకీ, ఖైదీ, సర్దార్ తర్వాత కార్తీ 6వ సారి ‘జపాన్’ కోసం డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో నటిస్తున్నాడు.

‘జపాన్’ (Japan Movie) సినిమా పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై సినిమాని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుందని అనౌన్స్ చేశారు. దర్శకుడు రాజు మురుగన్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. 

ఇందులో కమెడియన్, నటుడు సునీల్ (Actor Suneel), కన్నడ నటుడు విజయ్ మిల్టన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంతోనే తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇటీవల ‘ఊర్వసివో రాక్షసివో’తో ఆకట్టుకున్న గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) నటిస్తోంది.

Read More: కార్తీ (Karthi )నటించిన ‘సర్దార్‌’ (Sardar) గ్రాండ్ సక్సెస్.. డైరెక్టర్ కు ఖరీదైన కారు గిఫ్గ్ ఇచ్చిన నిర్మాత!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!