Mukhachitram: చెడ్డోడికి భయాన్ని పుట్టించాలంటున్న విశ్వక్ సేన్!.. ఆకట్టుకుంటున్న ‘ముఖచిత్రం’ ట్రైలర్

Updated on Dec 01, 2022 01:12 PM IST
‘ముఖచిత్రం’ (Mukhachitram) సినిమాలో కీలకమైన లాయర్ పాత్రలో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
‘ముఖచిత్రం’ (Mukhachitram) సినిమాలో కీలకమైన లాయర్ పాత్రలో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చాయి. కంటెంట్ బాగున్న సినిమాలకే ఆడియెన్స్ ఓటు వేస్తున్నారు. అలాంటి చిత్రాలు చూడటానికే వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, రొటీన్ కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరనేది కాకుండా చిత్రం కథ, కథనాలు ఏంటి, కొత్తదనం ఉందా అనే విషయాలకే మూవీ లవర్స్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నటీనటులు, మేకర్స్ కూడా దీన్ని స్వాగతిస్తుండటం గమనార్హం. 

స్టార్ హీరోలు కూడా మారిన పరిస్థితుల దృష్ట్యా స్టార్‌డమ్ గురించి కాకుండా కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కంటెంట్ కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు పక్కా అని ఈమధ్య కాలంలో విడుదలైన ఎన్నో చిన్న చిత్రాలు నిరూపించాయి. ఈ క్రమంలో మరో చిన్న సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ మూవీనే ‘ముఖచిత్రం’ (Mukhachitram). 

‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ వశిష్ట్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్‌తోపాటు ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, సీనియర్ నటుడు రవిశంకర్ యాక్ట్ చేస్తున్నారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు కాలభైరవ బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

తాజాగా ‘ముఖచిత్రం’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేసేలా కట్ చేసిన ఈ ట్రైలర్.. చిత్రంపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. ‘కోర్టు గెలుపు మెట్లెక్కి వచ్చిన ఓ మంచోడ్ని గెలిపించడంలో లేదు.. ఇంట్లో కూర్చున్న చెడ్డోడికి భయాన్ని పుట్టించడంలో ఉంది’ అని విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో లాయర్ పాత్ర పోషిస్తున్న విశ్వక్.. ఇంటెన్స్ లుక్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ఆయన పాత్రతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మరి, ఈ ‘ముఖచిత్రం’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. విశ్వక్ అతిథి పాత్ర మూవీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.  

Read more: హీరో సూర్య (Hero Suriya) అవార్డు విన్నింగ్ మూవీ 'జై భీమ్' (Jai Bhim)కు త్వరలో సీక్వెల్.. దర్శకుడు ఏమన్నారంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!