ప్రతి దర్శకుడు, నిర్మాతకూ ఇది అవమానమే.. అర్జున్–విశ్వక్ (Vishwak Sen) వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ 

Updated on Nov 08, 2022 01:58 PM IST
సినిమా మొదలుపెట్టిన తర్వాత మార్పుచేర్పులు చేయమనడం సరికాదని విశ్వక్ సేన్‌ను ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja)  అన్నారు
సినిమా మొదలుపెట్టిన తర్వాత మార్పుచేర్పులు చేయమనడం సరికాదని విశ్వక్ సేన్‌ను ఉద్దేశించి తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja)  అన్నారు

యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) తన కూతురు ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేయడానికి తానే దర్శక నిర్మాతగా మారారు. ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ (Vishwak Sen)ను తీసుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అర్జున్, విశ్వక్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. విశ్వక్ ధోరణి కారణంగా తన టీమ్ ఇబ్బందులు ఎదుర్కొందని.. ఇకపై ప్రాజెక్టును కొనసాగించే ఆలోచన లేదని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మరోవైపు తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వని కారణంగా, ఆ సినిమా విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానని విశ్వక్ స్పష్టం చేశారు. అర్జున్‌ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. 

తాజాగా ఈ విషయంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సినిమాకు ఒక్కసారి ఓకే అనుకున్నాక మాటలు బాగోలేదు.. పాటలు బాగోలేదు  అంటే సరికాదని ఆయన అన్నారు. ‘ఎన్టీ రామారావు గారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన డైరెక్టర్ ఏది చెబితే అదే చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను బాలకృష్ణ గారిలోనూ నేను చూశా. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్‌లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగ్ మొదలుపెట్టేశారు, విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నారు’ అని తమ్మారెడ్డి (Thammareddy Bharadwaja) అన్నారు.  

కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు

దర్శకుడి విషయాల్లో జోక్యం అవసరమా?

అర్జున్‌కు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. అర్జున్ చాలా సూపర్ హిట్లు ఇచ్చారని..  ఆయన అవుట్‌డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవాల్సిందన్నారు. కానీ సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు.. పాటలు బాగోలేదని అంటే ఎలా అని ప్రశ్నించారు. ‘ఈ మధ్య కాలంలో చాలా మంది కథానాయకులు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయి. కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు వివిధ రకాల కథలతో వస్తున్నారు. కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వల్ల ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.  

ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు

‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్‌లో ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలా మంది నిర్మాతలు .. చాలా మంది హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు.. అందరు నిర్మాతలు, దర్శకులకు అవమానమే’ అని తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు.

 Read more: Adipurush : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ గ్రాఫిక్స్‌లో మార్పులు.. రాజమౌళి (SS Rajamouli) చేతికి బాధ్యతలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!