విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Dhamki) రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 17న రిలీజ్!

Updated on Nov 24, 2022 03:21 PM IST
పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్నన ‘ధమ్కీ’ (Dhamki) మూవీ ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్నన ‘ధమ్కీ’ (Dhamki) మూవీ ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Dhamki). నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

ఇటీవలే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే సినిమా కథ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్నారు.  

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ (Dhamki Release Date) ను అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్నన ఈ మూవీ ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. భమ్‌ భోలేనాథ్ శివరాత్రి 2023కి మీ ముందుకు వస్తున్నాడు.. అంటూ జీన్స్‌, సూట్‌ ధరించి చేతిలో కర్రపట్టుకున్న పోస్టర్‌ను షేర్ చేస్తూ విడుదల తేదీ అప్‌డేట్ అందించాడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen).

ఇక, ఈ చిత్రంలో రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి, ఈ సినిమాతో విశ్వక్ హిట్ కొడతాడేమో చూడాలి. 

Read More: మరో వివాదంలో చిక్కుకున్న విశ్వక్ సేన్ (Vishwksen).. అలాంటి నటుడితో సినిమా తీయలేనంటున్న అర్జున్ (Arjun Sarja)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!