Sardar OTT Release: ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Updated on Nov 12, 2022 10:35 AM IST
స్టార్ హీరో కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar Movie) చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో త్వరలో అందుబాటులోకి రానుంది
స్టార్ హీరో కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar Movie) చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో త్వరలో అందుబాటులోకి రానుంది

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తి (karthi)కి తమళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది వరుస హిట్లతో ఆయన దూసుకెళ్తున్నారు.  ‘విరుమన్’ (Viruman) చిత్రంతో ఈ సంవత్సరం తొలి విజయాన్ని నమోదు చేసిన కార్తి.. ఆ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1)తో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో కార్తి పోషించిన పాత్ర కథను మలుపుతిప్పేదిగా సాగుతుంది. ఇక, ఆయన డబుల్ రోల్‌లో నటించిన ‘సర్దార్’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలైంది. 

తండ్రీ కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికలుగా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా, యంగ్ హీరోయిన్ రాజీషా విజయన్ నటించారు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘సర్దార్’ (Sardar Movie) సినిమా.. తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. దీపావళికి రిలీజైన చిత్రాల్లో ఎక్కువ మంది ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపించారు.

‘ఆహా’లో అందుబాటులోకి.. 

థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్‌ను ముగించిన ‘సర్దార్’ త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘ఆహా’ సంస్థ దక్కించుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ‘ఆహా’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఓటీటీలో సినిమాను చూడండంటూ ప్రేక్షకులను కార్తి కోరుతున్న మరో వీడియోనూ సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

25వ చిత్రం షురూ

‘సర్దార్’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కార్తి.. రెండు పాత్రల్లోనూ తనదైన నటనతో అలరించారు. అందులో ఒకటి పోలీస్ క్యారెక్టర్ కాగా.. మరొకటి స్పై ఏజెంట్ రోల్. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన ఊపులో మరో సినిమాకు మొదలుపెట్టేశారు కార్తి. ఆయన కెరీర్‌లో 25వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌ పతాకంపై రాజు మురుగన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘జపాన్’ (Japan Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

Read more: Yashoda Movie Review : సమంత నటనా విశ్వరూపాన్ని చూపించిన "యశోద" !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!