మరో వివాదంలో చిక్కుకున్న విశ్వక్ సేన్ (Vishwksen).. అలాంటి నటుడితో సినిమా తీయలేనంటున్న అర్జున్ (Arjun Sarja)!

Updated on Nov 06, 2022 01:12 PM IST
విశ్వక్‌ సేన్ (Vishwksen) ప్రస్తుతం సీనియర్ నటుడు, డైరెక్టర్ అయిన అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
విశ్వక్‌ సేన్ (Vishwksen) ప్రస్తుతం సీనియర్ నటుడు, డైరెక్టర్ అయిన అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwksen) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో ప్రాంక్ వీడియోలతో ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ వివాదంలో చిక్కకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. అయితే, ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) తో పెట్టుకుని ఓవైపు ఇండస్ట్రీలోనూ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. విశ్వక్‌ సేన్ (Vishwksen) ప్రస్తుతం సీనియర్ నటుడు, డైరెక్టర్ అయిన అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అర్జున్ కూతరు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హాజరై క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

ఆ కార్యక్రమానికి పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హాజరై క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ సేన్ (Vishwksen).. సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై అర్జున్ స్పందిస్తూ.. తమ సినిమా నుంచి విశ్వక్ సేన్ బయటకు వచ్చాడని వార్తలు వచ్చాయని, ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు. తన కూతురిని తెలుగులో హీరోయిన్ పరిచయం చేద్దామనుకున్నానని చెప్పారు. కథ చెప్పాక విశ్వక్ సేన్ కు కూడా స్టోరీ నచ్చిందని చెప్పాడని, అయితే షూటింగ్ రాకుండా ఇబ్బంది పెట్టాడని అర్జున్ మీడియా సమావేశంలో తెలిపారు.  

‘‘విశ్వక్ సేన్‌కి (Vishwksen) నేను చెప్పిన కథ బాగా నచ్చింది. నా కూతురు ఐశ్వర్య ఈ మూవీలో హీరోయిన్. అంతా బాగానే సాగుతున్న దశలో విశ్వక్ సేన్ నా ఫోన్‌ని లిప్ట్ చేయడం లేదు. నా జీవితంలో అతనికి చేసినన్ని కాల్స్ ఎవరికీ చేసుండను. రెమ్యూనరేషన్ కూడా అతను అడిగినంతే ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ అతను కాల్‌షీట్స్ వరుసగా మారుస్తూ వచ్చాడు. ఈ నెల 3 నుంచి షూటింగ్ జరగాల్సి ఉండగా.. 2న రాత్రి వరకు మాట్లాడుకున్నాం’’ అని తెలిపాడు. 

‘‘ఈ మూవీలో తన గెటప్‌పై కొన్ని ఫొటోలు, వీడియోల్ని కూడా విశ్వక్‌సేన్ (Vishwksen) నాకు షేర్ చేశాడు. కానీ షూటింగ్‌కి ముందు ఒక యాక్టర్‌ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి.. ఆ తర్వాత నా కాల్స్‌కి స్పందించడం లేదు. అతను మా సినిమా సెట్స్ నుంచి వెళ్లిపోయాడు అని వచ్చిన వార్తల్లో నిజం లేదు’’ అని అర్జున్ (Arjun Sarja) మీడియా సమావేశంలో వెల్లడించాడు. 

సీనియర్ హీరోలే ఎంతో కమిట్ మెంట్ తో పనిచేస్తున్నారని.. అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ లు అంకిత భావంతో పనిచేస్తారని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇలాంటి వాతావరణంలో సినిమా తీయలేనని అర్జున్ తెలిపారు.

Read More: Vishwak Sen : విశ్వక్ సేన్ , ఐశ్వర్య జంటగా నటించే సినిమాకి.. దర్శకుడిగా యాక్షన్ కింగ్ ' అర్జున్ ' !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!