'HIT 2' Teaser: 'హిట్ 2' టీజర్ వచ్చేసింది.. మరోసారి థ్రిల్లర్ కథాంశంతో సందడి చేస్తున్న అడివి శేష్ (Adivi Sesh)

Updated on Nov 03, 2022 12:46 PM IST
'హిట్ 2' (Hit 2) సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా యూనిట్ టీజర్ ని విడుదల చేసింది.
'హిట్ 2' (Hit 2) సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా యూనిట్ టీజర్ ని విడుదల చేసింది.

'HIT 2' Teaser: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ లో ‘హిట్’ (Hit) సిరీస్ ఒకటి. విశ్వక్ సేన్ (Vishwaksen) హీరోగా రుహానీ శర్మ హీరోయిన్ గా శైలేష్ కొలను ఈ సినిమా తెరకెక్కించారు. నాచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ సినిమాని ఆయన సోదరి త్రిపురనేని ప్రశాంతి నిర్మించారు. ఈ సినిమాకి సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించింది చిత్ర యూనిట్. 

'హిట్ సెకండ్ కేస్' (HIT 2)లో  అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రావు రమేష్, భానుచందర్, శ్రీనాథ్ మాగంటి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు.

'హిట్ 2' (Hit 2) సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా యూనిట్ టీజర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమా టీజర్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. టీజర్ కట్ చాలా థ్రిల్లింగ్ ఉంది. అడివి శేష్ హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా మరోసారి ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా పాత్ర చేశారనిపిస్తోంది. అడివి శేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నోటీదూల ఉన్న పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ డిఫరెంట్ లుక్ ను చూపించడం మరింత ఆసక్తికరంగా మారింది.

టీజర్ ను బట్టి చూస్తే అడివి శేష్ (Adivi Sesh) విశాఖపట్నంలో పని చేసే ఒక పోలీసు అధికారి కాగా ఆయనకు ఒక యువతిని అన్ని శరీర భాగాలు నరికి చంపిన ఒక కేసు ఎదురవుతుంది. దీంతో ఆయన రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో అడవి శేష్ కేడీ అనే పాత్రలో కనిపిసున్నారు. ఇక రావు రమేష్ డీజీపీ పాత్రలో కనిపిస్తుండగా సినిమా అంతా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. 

ఇప్పటికే ‘హిట్ వెర్స్’ (Hit Verse)ను దర్శకుడు శైలేష్ పరిచయం చేయడంతో ‘హిట్’ సిరీస్ లపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం సెకండ్ కేసు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!