నవ్వులు పూయిస్తున్న 'జిన్నా' (Ginna) ట్రైలర్.. కామెడీ టైమింగ్ లో ఆకట్టుకున్న మంచు విష్ణు (Manchu Vishnu)..!

Updated on Oct 13, 2022 12:16 PM IST
'జిన్నా' (Ginna Trailer) ట్రైలర్‌లో కామెడీకి హార్రర్‌ను జోడించినట్లు చూపించారు. ఇందులో మంచు విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
'జిన్నా' (Ginna Trailer) ట్రైలర్‌లో కామెడీకి హార్రర్‌ను జోడించినట్లు చూపించారు. ఇందులో మంచు విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ  'జిన్నా' (Ginna). ఇందులో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. గతేడాది 'మోసగాళ్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మంచు విష్ణు.. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంతో ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.

'జిన్నా' (Ginna) సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 'జిన్నా' చిత్ర ట్రైలర్ ఆద్యంతం కామెడీ అంశాలతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.

'జిన్నా' (Ginna Trailer) ట్రైలర్‌లో కామెడీకి హార్రర్‌ను జోడించినట్లు చూపించారు. ఇందులో మంచు విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో థియేటర్లో నవ్వులు పూయడం ఖాయంగా కనిపిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇందులో గాలి నాగేశ్వ‌ర‌రావు అనే టెంట్‌హౌజ్ ఓన‌ర్‌గా మంచు విష్ణు క‌నిపించ‌బోతున్నాడు. బ్యాడ్‌ల‌క్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న అత‌డి జీవితంలోకి ఓ ఎన్ఆర్ఐ అమ్మాయి రాక‌తో ఎలాంటి మార్పులు వ‌చ్చాయ‌నే పాయింట్‌తో 'జిన్నా' సినిమా తెర‌కెక్కింది. 

ఇదిలా ఉంటే. ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూసినా, కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేశారు. ఈ సినిమాకు అనూప్ మంచి మ్యూజిక్ అందించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఇక, ఈ సినిమాను మంచు విష్ణు (Manchu Vishnu) AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తుండగా.. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

Read More: Ginna First Look: పవర్ ఫుల్ పాత్రలో మంచు విష్ణు (Manchu Vishnu).. జిన్నా ఫస్ట్ లుక్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!