Project K: ఇలాంటి సినిమాను ఇంతవరకు ఎవ్వరూ చూసుండరు.. ‘ప్రాజెక్ట్ కే’పై నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

Updated on Nov 19, 2022 02:40 PM IST
 ‘మహానటి’ సినిమా కోసం కార్లు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నామని.. కానీ ప్రాజెక్ట్ కే (Project K)కు అలా కుదరదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు
‘మహానటి’ సినిమా కోసం కార్లు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నామని.. కానీ ప్రాజెక్ట్ కే (Project K)కు అలా కుదరదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. (Project K) ఆయన సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్ట్ చేస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ‘మహానటి’ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ప్రాజెక్ట్ కే’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న సినిమాగా ‘ప్రాజెక్ట్ కే’ను చెబుతున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.500 కోట్లు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. స్కై–ఫై జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పనులు మొదలై దాదాపు రెండేళ్లు కావొస్తున్న పెద్దగా అప్‌డేట్స్ రావడం లేదు. ఈ మధ్య ప్రభాస్ పుట్టిన రోజుకు బయటకు వచ్చిన ఒక ఫొటో తప్పితే.. ఈ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై కచ్చితమైన సమాచారం రావడం లేదు. 

ప్రాజెక్ట్ కే’ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇది సాధారణ సినిమా కాదని నాగి అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి మూవీని వెండితెరపై ఎవరూ చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ఓ మీడియా ప్రతినిధితో నాగి మాట్లాడిన ఈ వ్యాఖ్యల ఆడియో ఫైల్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

‘ఇది చాలా కొత్త సినిమా. స్క్రిప్ట్ కూడా కొత్తది. దీని కోసం తయారు చేసిన ప్రపంచం.. టెక్నీషియన్స్ అంతా కొత్తగా ఉంటాయి. ఒకరకంగా ఈ మూవీ ఎలా చేయాలని ఆలోచించడానికే చాలా టైమ్ పడుతోంది. అన్నీ కొత్తగా తయారు చేయాలి. ‘మహానటి’ సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం. ఈ సినిమాకు అలా కుదరదు. అన్నీ మేమే తయారు చేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా మూవీ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది’ అని ఆ ఆడియోలో నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.  ఈ వాయిస్ నాగ్ అశ్విన్‌దేనా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

Read more: Ira Khan: ప్రియుడితో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!