రూ.100 కోట్లతో కొత్త ఇల్లు!.. ఐశ్వర్య (Aishwarya Rajinikanth)తో కలసి గృహ ప్రవేశానికి ధనుష్ (Dhanush) ప్లాన్?

Updated on Oct 18, 2022 06:37 PM IST
ధనుష్ (Dhanush)–ఐశ్వర్య (Aishwarya Rajinikanth) త్వరలో కలసిపోతారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి 
ధనుష్ (Dhanush)–ఐశ్వర్య (Aishwarya Rajinikanth) త్వరలో కలసిపోతారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి 

కోలీవుడ్ స్టార్ దంపతులు ధనుష్ (Dhanush)–ఐశ్వర్యా రజినీకాంత్‌ (Aishwarya Rajinikanth)లు త్వరలో మళ్లీ కలుస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాము విడిపోయామని ఈ ఏడాది జనవరిలో ధనుష్–ఐశ్వర్యలు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మొత్తానికి మనసు మార్చుకున్నారని వినికిడి. తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పిల్లల కోసం వీరు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని.. మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

ఈ తరుణంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా విడాకుల రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుష్‌కు తన పిల్లల సంతోషమే ముఖ్యమని ఆయన అన్నారు. దీంతో విడాకుల రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ధనుష్–ఐశ్వర్య ఫాలోవర్స్ సంబరపడుతున్నారు. ఈ జంటపై మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుష్ త్వరలో ఓ కొత్త ఇంటిని కొంటున్నారని.. విడాకుల రద్దు తర్వాత ఐశ్వర్య, పిల్లలతో కలసి ఆ ఇంట్లోకి మారేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ వస్తున్నాయి.  

ధనుష్ కొనబోయే ఇంటి ఖరీదు దాదాపుగా రూ.100 కోట్లని సమాచారం. విడాకుల రద్దు ప్రకటన అనంతరం భార్య, పిల్లలతో ఆయన గృహ ప్రవేశం చేస్తారని కోలీవుడ్ (Kollywood) మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. మరి, దీనిపై ధనుష్–ఐశ్వర్యలు అధికారికంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అయితే, వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక, 2004 నవంబర్ 18న ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా (15), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఇక, ధనుష్ కెరీర్ విషయానికొస్తే.. చివరగా ఆయన ‘తిరు’ (Thiru) సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ స్టార్ హీరో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘సార్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఆయన అడుగు పెడుతున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములతోనూ ఓ చిత్రానికి ధనుష్ కమిట్ అయ్యారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. 

Read more: SIR: హీరో ధ‌నుష్ (Dhanush) కొత్త సినిమా "సార్" : టాప్ 10 ఆస‌క్తిక‌ర విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!