పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి (Anjali).. అమెరికాలో ఉంటున్నారనే రూమర్స్ పైనా క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Updated on Dec 13, 2022 11:41 AM IST
ప్రస్తుతం తనకు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని స్టార్ హీరోయిన్ అంజలి (Actress Anjali) స్పష్టం చేశారు
ప్రస్తుతం తనకు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదని స్టార్ హీరోయిన్ అంజలి (Actress Anjali) స్పష్టం చేశారు

ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. కానీ హీరోయిన్ అంజలి (Actress Anjali) విషయంలో మాత్రం ఇది తారుమారైంది. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించారు. మొదట్లో తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో చెన్నైకి మకాం మార్చిన అంజలి.. అక్కడ సక్సెస్ అయ్యారు. ‘అంగాడి తెరు’, ‘ఎంగేయుమ్ ఎప్పోద్దుమ్’ లాంటి చిత్రాలతో తమిళంలో క్రేజ్ తెచ్చుకున్నారామె.

కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న అంజలికి తెలుగులోనూ మంచి ఆఫర్లు దక్కాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ వంటి చిత్రాలు ఆమెకు ఇక్కడ పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ మధ్యలో ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తూ బిజీగా ఉన్నారు. కాగా, ఇటీవల అంజలి యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘ఫాల్’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు ఈ అందాల భామ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

 ఇటీవల అంజలి యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘ఫాల్’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది

గతంలో తమిళ హీరో జైతో అంజలి ప్రేమలో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ వార్తల పైనా అంజలి స్పందించారు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని, అమెరికాలో నివాసం ఉంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. ‘నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ ఒట్టి వదంతులు. ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అయితే వివాహం మాత్రం కచ్చితంగా చేసుకుంటా. ఆ టైమ్ వచ్చినప్పుడు అందరికీ చెబుతా’ అని అంజలి చెప్పుకొచ్చారు. 

Read more: టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్‌10 క్రేజీ కాంబినేషన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!