ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘లాఠీ’ (Laatti Trailer).. ట్రైలర్ లో విశాల్ (Hero Vishal) దుమ్ము దులిపాడుగా..!

Updated on Dec 13, 2022 02:24 PM IST
విశాల్ (Hero Vishal) ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సినిమాల్లో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్రల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.
విశాల్ (Hero Vishal) ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సినిమాల్లో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్రల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తమిళ స్టార్ హీరో విశాల్ (Hero Vishal) గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయన సినిమాలంటే ఇక్కడి ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆయన హీరోగా సునయన హీరోయిన్ గా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద నిర్మిస్తున్న చిత్రం ‘లాఠీ’ (Laatti). ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబ‌ర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశాల్ (Hero Vishal) ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సినిమాల్లో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్రల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి అందుకు భిన్నంగా సాధార‌ణ కానిస్టేబుల్ పాత్ర‌లో మెప్పించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయింది.

‘ఇక్కడ జరగబోయేది తెల్లారితే మర్చిపోయేలా ఉండకూడదు. ఎన్నో ఏళ్లు, ఎంతోమంది దీని గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి’ అనే డైలాగ్‌‌తో ప్రారంభమయిన ట్రైలర్ (Laatti Trailer) కంప్లీట్ యాక్షన్ మోడ్‌‌లో ఉంది. ‘మీ లాంటి వాళ్ళను చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులిచ్చే ఆర్డర్‌ కాదురా.. ఆఫర్‌’ అంటూ విశాల్ డైలాగ్‌ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. విశాల్‌, సునయన మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్‌ అయినట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రానా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ, నంద సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌ సమయంలో విశాల్ రెండు సార్లు మేజర్‌గా గాయపడటంతో చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక, ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోనూ రిలీజ్‌ కానుంది.

ప్ర‌స్తుతం విశాల్ (Hero Vishal) ‘మార్క్ ఆంటోని’ అనే పీరియాడిక్ మూవీలోనూ న‌టిస్తున్నారు. దీంతో పాటు త‌న ద‌ర్శ‌క నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న ‘డిటెక్టివ్ 2’ (Detective 2) సినిమాను విడుద‌ల చేయ‌టానికి విశాల్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

Read More: విశాల్ (Vishal) నటిస్తున్న కొత్త చిత్రం 'మార్క్ ఆంటోనీ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సూపర్ రెస్పాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!