‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), పి వాసు కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. కేవలం రూ.9కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ.70కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కీలక పాత్రలో కనింపిచనున్నారు.
2005లో రిలీజ్ అయిన ఈ హారర్ కామెడీ మూవీ తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అనుకున్నారంతా. కానీ రజనీకాంత్ ఈసినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. సీక్వెల్ ప్రయత్నం ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది.
అయితే, ఈసారి చంద్రముఖి సీక్వెల్ లో రజనీ కాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖిని తెరకెక్కించిన పి.వాసు (Director P Vasu) దర్శకుడిగా.. ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే చంద్రముఖి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజలుగా హీరోయిన్ వేటలో ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ తార కంగనారనౌత్ (Kangana Ranaut) ను ఎంపిక చేశారు. అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రకు కొనసాగింపుగా కంగనారనౌత్ కనిపించనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సెట్స్‌లో జాయిన్ అయింది కంగనా రనౌత్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం అయినట్లు కంగనా తెలిపింది. క్లాసికల్ డాన్స్ లో కంగనాకు చక్కటి ప్రవేశం ఉండటంతో ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేశారని తెలుస్తోంది. సినిమా అంతటికీ ఈ క్యారెక్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. మొన్నటి వరకూ ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది కంగనా. ఈ మూవీ షెడ్యూల్ అసోం లో పూర్తి చేసుకుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి పరిణామాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ఇందిర పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు కంగననే స్వయంగా డైరెక్ట్ చేస్తోంది.
Read More: Chandramukhi 2 Update: ‘చంద్రముఖి 2’ నుంచి క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి!