Nayanthara: హారర్ థ్రిల్లర్‌తో భయపెడుతున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార.. ‘కనెక్ట్’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

Updated on Dec 05, 2022 06:47 PM IST
హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ‘కనెక్ట్’ (Connect Movie) మూవీని రూపొందిస్తున్నారు
హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ‘కనెక్ట్’ (Connect Movie) మూవీని రూపొందిస్తున్నారు

నయనతార (Nayanthara) అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. సౌత్ నంబర్ వన్ హీరోయిన్‌గా వరుస హిట్స్‌తో ఆమె దూసుకెళ్తున్నారు. సీనియర్ హీరోలతోపాటు కుర్ర హీరోల సరసన కూడా సినిమాలు చేసే నయన్.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఆడియెన్స్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించారు. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోమారు తెలుగు ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ కోలకళ్ల సుందరి సిద్ధమవుతున్నారు. ‘కనెక్ట్’ (Connect Movie) అనే చిత్రంతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. 

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కనెక్ట్’ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించగా.. దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తోంది. హారర్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అశ్విన్ శరవణన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

నయనతార పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ‘కనెక్ట్‌’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్ 22న తెలుగులో విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ మూవీలో ప్రముఖ నటులు అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌‌తోపాటు వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పృథ్వి చంద్రశేఖర్ బాణీలు సమకూర్చారు. 

Read more: Tollywood : థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేసిన టాలీవుడ్‌ టాప్‌10 సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!