Neynay Vasthunnaa : ధనుష్ (Dhanush) న‌టిస్తున్న సినిమా 'నేనే వ‌స్తున్నా' తెలుగు పోస్ట‌ర్ రిలీజ్‌

Updated on Sep 14, 2022 03:00 PM IST
ధ‌నుష్ (Dhanush) న‌టించిన ‘నానే వ‌రువెన్’ చిత్రాన్ని తెలుగులో 'నేనే వ‌స్తున్నా' టైటిల్‌తో రిలీజ్ చేయ‌నున్నారు. 
ధ‌నుష్ (Dhanush) న‌టించిన ‘నానే వ‌రువెన్’ చిత్రాన్ని తెలుగులో 'నేనే వ‌స్తున్నా' టైటిల్‌తో రిలీజ్ చేయ‌నున్నారు. 

సౌత్ ఇండియాలో పాపుల‌ర్ న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో  ధ‌నుష్ (Dhanush). హాలీవుడ్‌లో కూడా ధ‌నుష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌లే విడుద‌లైన ‘తిరు’ సినిమాతో  ఆయన హిట్ సాధించారు. ఈ సినిమా ధ‌నుష్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. ప్ర‌స్తుతం ధ‌నుష్ రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'సార్' సినిమా తెర‌కెక్కుతోంది. మ‌రో సినిమా ‘నానే వ‌రువెన్’ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ‘నానే వ‌రువెన్’ చిత్రాన్ని తెలుగులో 'నేనే వ‌స్తున్నా' పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. 

తెలుగులో స‌మ‌ర్పిస్తున్న అల్లు అర‌వింద్

'నేనే వ‌స్తున్నా' చిత్రానికి సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్ట‌ర్లు, పాట‌లు ఇప్పటికే  అభిమానులకు అంచ‌నాల‌ను పెంచేశాయి. హాలీవుడ్‌లో కూడా పాపుల‌ర్ అయిన ధ‌నుష్‌‌కు (Dhanush),  ఈ సినిమా ఎలాంటి స‌క్సెస్ ఇవ్వ‌నుందో చూడాలి. 'నేనే వ‌స్తున్న' సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ సినిమాను తెలుగులో  గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. 

డ‌బుల్ రోల్‌లో ధ‌నుష్

'నేనే వ‌స్తున్న' సినిమాలో ధ‌నుష్ (Dhanush) హీరోగా, విల‌న్‌గా కూడా న‌టిస్తున్నారు.ఈ సినిమాలో డ‌బుల్ రోల్‌లో ధ‌నుష్ ఎలాంటి వినోదం అందిస్తారోన‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. ధ‌నుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్ర‌మ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించారు. సెల్వ‌ రాఘ‌వ‌న్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో ఈ సినిమాలో న‌టించారు. ఈ చిత్రాన్ని వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి ఎస్ థాను నిర్మించారు. 

Read More: The Gray Man: 'ట్రోల్ చేస్తున్నార‌ని బాధ ప‌డ‌కండి.. హాలీవుడ్ సినిమా చేసే అవ‌కాశం రావ‌చ్చు' - ధ‌నుష్ (Dhanush)

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!