SIR: హీరో ధనుష్ (Dhanush) కొత్త సినిమా "సార్" : టాప్ 10 ఆసక్తికర విశేషాలు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తమిళ భాషతో పాటు తెలుగులోనూ నటిస్తున్న చిత్రం ‘సార్’. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ధనుష్ నటించిన "నేనే వస్తున్న" సినిమా ఇటీవలే విడుదైంది. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక "సార్"తో తెలుగు ఇండస్ట్రీలో తన లక్ మరోసారి పరీక్షించుకునేందుకు ధనుష్ రెడీ అవుతున్నారు.
"సార్" చిత్రంపై టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం.
1.ధనుష్ పాత్ర
లవర్ బాయ్‌గా అనేక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల్లో ధనుష్ నటించారు. రఘువరన్ బీటెక్, వీఐపీ 2, తిరు లాంటి సినిమాలలో సరికొత్త పాత్రలతో తన అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ మధ్య కాలంలో "అసురన్" లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులకు వినోదం పంచారు. "సార్" చిత్రంలో కూడా ధనుష్ సరికొత్త పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ బాలగంగాధర్ తిలక్ అనే లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు.
2. కథ ఏమిటంటే..
ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించిన ధనుష్.. చదువును బిజినెస్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటాడు. ఈ క్రమంలో హీరో తనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమిస్తాడనే కోణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
3. తెలుగు డైరెక్టర్
"సార్" సినిమాను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. "కేరింత" సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ధనుష్‌తో "సార్" చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు.
4.రిలీజ్ తేదీ ఎప్పుడంటే..
"సార్" సినిమాను డిసెంబర్ 2 తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు అడవి శేష్ నటిస్తున్న "హిట్ 2" కూడా రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా "ఎన్‌బీకే 107" కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. "సార్" సినిమాతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి వినోదం అందిస్తారో మనం వేచి చూడాలి.
5.హీరోయిన్‌గా కేరళ కుట్టి..
మలయాళీ భామ సంయుక్త మీనన్ "సార్" సినిమాలో ధనుష్‌కు జోడిగా నటించనున్నారు. భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలలో సంయుక్త మీనన్ నటించి మెప్పించారు. ఇక "సార్" సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా వినోదం పంచనున్నారు సంయుక్త మీనన్.
6.రెండు భాషల్లో రిలీజ్..
ధనుష్ (Dhanush) నటిస్తున్న "సార్" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ధనుష్ నటించిన సినిమాలు గతంలో తెలుగులో డబ్ అయి రిలీజ్ అయ్యేవి. కానీ ధనుష్ "సార్" సినిమాను తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నారు.
7.రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్
"సార్" చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఓటీటీ, థియేట్రికల్ హక్కులు అన్నీ కలిపి సుమారు రూ. 90 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
8. మ్యూజిక్ గురించి
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
9. విలన్ ఎవరో తెలుసా!
తెలుగు సినిమాలలో విలన్ పాత్రల్లో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించి మెప్పించారు. సౌత్ సినిమా రంగంలో సాయికుమార్ నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 'సార్' చిత్రంలో సాయికుమార్ మరోసారి తన విలనిజం ఏంటో చూపించనున్నారు.
10. నిర్మాతలు
'సార్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇవండీ... "సార్" సినిమాకు సంబంధించిన టాప్ టెన్ విశేషాలు.
Read More : ధనుష్ (Dhanush) 'సార్' డిసెంబర్‌లో వచ్చేస్తున్నారు!.. అక్షరమే ధనుష్ ఆయుధమా!!