Hero Dhanush: 'కెప్టెన్ మిల్లర్'గా రాబోతున్న హీరో ధనుష్.. అదరగొడుతున్న మోషన్ పోస్టర్!

Updated on Jul 04, 2022 06:14 PM IST
హీరో ధ‌నుష్ (Hero Dhanush)
హీరో ధ‌నుష్ (Hero Dhanush)

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ (Hero Dhanush) తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. ఈ హీరో న‌టించిన సినిమాలు టాలీవుడ్ లోనూ అడ‌పా ద‌డ‌పా విడుద‌ల‌వుతూ ఉండేవి. అయితే ధ‌నుష్‌కు ‘ర‌ఘువ‌ర‌న్ బీటెక్’ సినిమా తెలుగులో మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్‌ తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. 

సూపర్ స్టార్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) అనే టైటిల్ ఖరారు చేశారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను (Captain Miller Motion Poster) మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40నాటి షిప్ ని చూపిస్తూ కథానాయకుడి పాత్ర ముఖం కనిపించకుండా స్కార్ఫ్ నిచుట్టుకొని ఒక వింటేజ్ బైక్ నడుపుకుంటూరావడం, తర్వాత టైటిల్ రివిల్ కావడం ఎక్సయిటింగా ఉంది. 

వీడియోలో వినిపించిన నేపథ్య సంగీతం ఔట్ స్టాండింగ్ గా ఉంది. ఈ చిత్రం భారీ పీరియాడికల్ మూవీగా ఉండబోతోందని ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం ధ‌నుష్ న‌టించిన తాజా హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ జూలై 15న విడుద‌ల కానుంది. దీనితో పాటుగా తమిళంలో ‘తిరుచిత్రంబ‌లం’ ఆగ‌స్టు 22న విడుద‌ల కానుంది. తెలుగులో వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర్’ (SIR Movie) సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, నిర్మాత టీజీ త్యాగరాజన్‌ (TG Tyagarajan) మాట్లాడుతూ తమ సంస్థలో నిర్మించిన భారీ చిత్రాల్లో ఇది చోటు దక్కించుకుంటుందని అన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు తానూ, ధనుష్‌ చాలా హ్యాపీగా ఫీలయ్యామన అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, మదన్‌ కార్తీ మాటలు, శ్రేయోస్‌ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Read More: విద్యాసాగర్ మరణం పై వస్తున్న పుకార్లపై స్పందించిన మీనా (Meena) ! తన భర్త మృతిని వివాదాస్పదం చేయవద్దని అభ్యర్థన

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!