Dhanush-Aishwarya: ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారా..? విడాకుల తొలిసారి ఒకే ఫ్రేములో కనిపించిన జంట ఫొటో వైరల్!

Updated on Aug 23, 2022 04:50 PM IST
ధనుష్ (Dhanush), ఐశ్వర్య ( Aishwarya Rajinikanth) దంపతులకు యాత్రా (Yatra), లింగ (Linga) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ధనుష్ (Dhanush), ఐశ్వర్య ( Aishwarya Rajinikanth) దంపతులకు యాత్రా (Yatra), లింగ (Linga) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (Aishwarya) కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ  18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది.  

అయితే, ధనుష్-ఐశ్వర్య (Dhanush-Aishwarya) విడిపోయిన తర్వాత కూడా అందరి భార్యాభర్తల్లా అసలు మాట్లాడుకోకుండా, గొడవలతోనో, ఒకరి మీద ఒకరు నెగిటివ్ గా చెప్పడం లాంటివి చేయకుండా ఇద్దరూ ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు. వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను వెంటేసుకుని ధనుష్‌ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్‌-ఐశ్వర్య జంట.

వివరాల్లోకి వెళితే.. ధనుష్, ఐశ్వర్య దంపతులకు యాత్రా (Yatra), లింగ (Linga) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా పెద్ద కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సందర్భంలో వారిద్దరూ మాట్లాడుకున్నారు కూడా. 

కాగా, మొదటి సారి విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు.. ఈ వేడుకకు విజయ్ యేసుదాస్, అతడి భార్య కూడా హాజరయ్యారు.

ధనుష్ (Hero Dhanush) సినిమాల విషయానికి వస్తే.. చివరగా ఆయన ‘తిరు’ (Thiru) లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ స్టార్ హీరో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘సార్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man) సీక్వెల్‌లోను అతడు కనిపించనున్నాడు. 

Read More: Hero Dhanush: 'కెప్టెన్ మిల్లర్'గా రాబోతున్న హీరో ధనుష్.. అదరగొడుతున్న మోషన్ పోస్టర్!

Advertisement
Credits: Instagram, Pinkvilla

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!