హీరో ధనుష్‌ (Hero Dhanush) తాజా చిత్రం 'నేనే వస్తున్నా' (Nene Vasthunna) నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్..!

Updated on Sep 25, 2022 04:50 PM IST
‘ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’ (Oke Oka Oorilona) అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించారు.
‘ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’ (Oke Oka Oorilona) అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించారు.

గ్లోబల్ స్టార్‌ హీరో ధనుష్‌ (Hero Dhanush) నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'నేనే వస్తున్నా' (Nene Vasthunna Movie) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ (Hero Dhanush).. ఏమాత్రం ఆలస్యం లేకుండా మూడు నెలల గ్యాప్ లో చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్, ఆ చిత్రాల్లో పాటలు కూడా రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. 

‘ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’ (Oke Oka Oorilona) అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాగా, ఈ పాటలో ‘పాముల్లోనా విషముంది, పువ్వులోనా విషముంది.. పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే.. మనిషిలో మృగమే దాగుంది.. మృగములో మానవత ఉంటుంది’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

'నేనే వస్తున్నా' (Nene Vasthunna) చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ చేస్తుండగా.. ఆయనలోని రెండు విభిన్నకోణాలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో నటించారు. 

Read More: Dhanush-Aishwarya: ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారా..? విడాకుల తొలిసారి ఒకే ఫ్రేములో కనిపించిన జంట ఫొటో వైరల్!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!