దుమ్ము రేపుతున్న ‘చల్లా చల్లా’ (Challa Challa) సాంగ్.. అజిత్‌ (AjithKumar) 'తునివు' నుంచి మాస్ బీట్ రిలీజ్!

Updated on Dec 10, 2022 04:12 PM IST
గత 24గంటల్లో అత్యధిక వీక్షకులని పొందిన వీడియోగా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ‘చిల్లా చిల్లా’ (Chilla Chilla Song) సాంగ్.
గత 24గంటల్లో అత్యధిక వీక్షకులని పొందిన వీడియోగా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ‘చిల్లా చిల్లా’ (Chilla Chilla Song) సాంగ్.

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. 'వాలి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘గ్యాంబ్ల‌ర్’ వంటి సినిమాల‌తో తెలుగులో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. ఈయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌లవుతుంటాయి. ఈ ఏడాది ‘వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్‌.. ప్రస్తుతం అదే జోష్‌లో ఉన్నారు.

అజిత్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్‌.వినోద్‌ (H.Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఒకటి. ఈ మూవీ కి చిత్ర బృందం 'తునివు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నుంచి ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.

‘తునివు’ (Thunivu) ఆల్బమ్ నుంచి బయటకు వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ కి ‘జిబ్రాన్’ ట్యూన్ కంపోజ్ చేయగా.. మరో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడడం విశేషం. అనిరుధ్ వాయిస్ ‘చిల్లా చిల్లా’ సాంగ్ కి ప్రాణం పోసింది. అజిత్ అభిమానుల్లో జోష్ నింపిన చిల్ల చిల్లా సాంగ్ ‘తునివు’ ప్రమోషన్స్ కి మంచి ఊపును తెచ్చిపెట్టింది. 

గత 24గంటల్లో అత్యధిక వీక్షకులని పొందిన వీడియోగా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ‘చిల్లా చిల్లా’ (Chilla Chilla Song) సాంగ్. విడుదలయిన 15గంటల్లో 7.5 మిలియన్స్ వ్యూస్, 980K లైక్స్ రాబట్టిన ‘చిల్లా చిల్లా’ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, ఈ సాంగ్ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై అంచనాలని కూడా అమాంతం పెంచింది.

ఇక, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్‌ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన అజిత్‌ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. త్వరలోనే చిత్రబృందం తెలుగు డబ్బింగ్‌ పనులు స్టార్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read More: Hero Ajith: సినిమాల్లోనే కాదు షూటింగ్ లోనూ సత్తా చాటుతున్న తమిళ్ తలైవా అజిత్ కుమార్.. 6 బంగారు పతకాలు కైవసం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!