విశాల్ (Hero Vishal) తాజా సినిమా ‘లాఠీ’ (Laththi).. ట్రైలర్ విడుదల తేదీ, సమయం ఫిక్స్..!

Updated on Dec 10, 2022 12:44 PM IST
‘లాఠీ’ (Laththi) టీజర్ తోనే అందరినీ అలరించిన విశాల్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎలా తన యాక్షన్ సన్నివేశాలతో భయపెడతాడో చూడాలి.
‘లాఠీ’ (Laththi) టీజర్ తోనే అందరినీ అలరించిన విశాల్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎలా తన యాక్షన్ సన్నివేశాలతో భయపెడతాడో చూడాలి.

కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ (Hero Vishal) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ తన సినిమాలను విడుదల చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా.. విశాల్ సినిమాకి కలెక్షన్స్‌ బాగానే వస్తాయి. ఇటీవల వచ్చిన ‘సామాన్యుడు’ సినిమాతో అంతగా మ్యాజిక్ చేయలేకపోయిన విశాల్ తాజాగా ‘లాఠీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో, రానా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రమణా నంద సంయుక్తంగా ‘లాఠీ’ (Laththi) సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 12న సాయంత్రం 5గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

‘లాఠీ’ (Laththi) టీజర్ తోనే అందరినీ అలరించిన విశాల్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎలా తన యాక్షన్ సన్నివేశాలతో భయపెడతాడో చూడాలి. అయితే, విశాల్ నుంచి ఈ మధ్యకాలంలో ఈ తరహా యాక్షన్ మూవీ రాలేదు. పైగా ఇది పోలీస్ స్టోరీ కావడంతో లాఠీ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు సాగే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రానికి హైలైట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా విశాల్‌ (Vishal) కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి మరి. 

ఈ పాన్ ఇండియా మూవీలో విశాల్ (Vishal) సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అతి త్వరలో దీనిని భారీ స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకువచేదుకు సిద్ధం అవుతోంది యూనిట్. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ సినిమాను ఈనెలలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Read More: 20ఏళ్ల తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. డైరెక్టర్ క్రిష్ (Krish) కామెంట్స్ వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!