ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌!

Updated on Sep 26, 2022 07:40 PM IST
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల కాలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు. అయితే ప్రభాస్ అభిమానులు ఎగిరిగంతేసే వార్త వచ్చింది. ఎప్పటినుంచో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసే డేట్‌ గురించి సమాచారం వచ్చింది.

మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా, బాలీవుడ్ భామ కృతిసనన్‌ సీతగా నటించారు. 2023 జనవరి 12వ తేదీన ఆదిపురుష్ సినిమాను పాన్‌ వరల్డ్ లెవెల్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రాముడి జన్మ స్థలమైన అయోధ్యలో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం.

ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌ను అక్టోబర్‌‌ 2వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ పాల్గొంటారని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారనే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. టీజ‌ర్ లాంఛింగ్‌కు అయోధ్య సరైన ప్రదేశంగా భావిస్తున్న చిత్ర యూనిట్‌ ఫస్ట్‌లుక్‌ను అక్కడే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్‌ టాక్.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది

టీజర్‌‌ కూడా ఇక్కడే..

ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన అనంతరం.. అక్టోబ‌ర్ 5వ తేదీన ల‌వ్‌కుష్ రామ్‌లీలా కార్యక్రమానికి హాజ‌రుకానున్నార‌ని టాక్. అక్కడ జరిగే ద‌స‌రా వేడుక‌లు, రావ‌ణ ద‌హ‌నం కార్యక్రమాల్లో ప్రభాస్‌ పాల్గొన‌నున్నారని టాక్‌. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఆదిపురుష్‌ సినిమాకు సాచెట్‌ -ప‌రంప‌ర సంగీతం అందించారు.

తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ‌, ఆంగ్ల భాష‌ల్లో ఆదిపురుష్‌ సినిమాను గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ప్రభాస్ (Prabhas) రాముడి క్యారెక్టర్ చేసిన ఆదిపురుష్ (Adipurush) సినిమాలో  సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్ర పోషిస్తుండ‌గా.. ల‌క్ష్మణుడిగా స‌న్నీ సింగ్, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్తా న‌గే న‌టిస్తున్నారు.

Read More : ‘సలార్’ (Salaar)  షూటింగ్‌లో డార్లింగ్ .. పెద్ద‌నాన్న ఆశ‌యం నెర‌వేర్చ‌నున్న‌ ప్ర‌భాస్ (Prabhas)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!