‘సలార్’ (Salaar)  షూటింగ్‌లో డార్లింగ్ .. పెద్ద‌నాన్న ఆశ‌యం నెర‌వేర్చ‌నున్న‌ ప్ర‌భాస్ (Prabhas)!

Updated on Sep 23, 2022 04:00 PM IST
హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌రిగే 'స‌లార్' షూటింగ్‌కు ప్ర‌భాస్ (Prabhas) హాజ‌ర‌వుతున్నారు. 
హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌రిగే 'స‌లార్' షూటింగ్‌కు ప్ర‌భాస్ (Prabhas) హాజ‌ర‌వుతున్నారు. 

పాన్ ఇండియ స్టార్  ప్ర‌భాస్‌ (Prabhas) త‌న పెద్ద‌నాన్న కృష్ణంరాజు మృతితో ప‌లు షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ న‌టించే సినిమాల‌న్నీ పాన్ ఇండియా సినిమాలే. అదీకాక భారీ బడ్జెట్‌తో 'స‌లార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. అన్ని సినిమాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్ర‌భాస్ కూడా మ‌ళ్లీ త‌న సినిమా షూటింగ్‌ల‌కు వెళ్లేందుకు సిద్ధమ‌వుతున్నారట‌.

షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వుతున్న ప్ర‌భాస్

ప్ర‌భాస్, కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ కాంబోలో 'స‌లార్' చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కృష్ణంరాజు మృతితో ఆగిపోయింది. ప్ర‌భాస్ కృష్ణంరాజు మృతికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. భారీ బ‌డ్జెట్ సినిమాలు కావ‌డంతో ప్ర‌భాస్ త‌ప్ప‌క సినిమా షూటింగ్‌ల‌కు హాజ‌ర‌వ‌నున్నారు. కృష్ణంరాజు, ప్ర‌భాస్ ఎవ‌రికీ న‌ష్టం క‌లిగించే ప‌నులు చేయ‌ర‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ప్ర‌భాస్ కూడా త‌న‌ను న‌మ్ముకున్న నిర్మాత‌ల‌కు స‌పోర్ట్‌గా ఉండ‌నున్నారు.

హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌రిగే 'స‌లార్' షూటింగ్‌కు ప్ర‌భాస్ (Prabhas) హాజ‌ర‌వుతున్నారు. 

‘సలార్’ చిత్రీకరణను ప్ర‌శాంత్ నీల్ మళ్లీ ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 27 వరకు కొనసాగించనున్నారు. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌రిగే 'స‌లార్' షూటింగ్‌కు ప్ర‌భాస్ హాజ‌ర‌వుతున్నారు. కృష్ణంరాజు ఎప్పుడూ ప్ర‌భాస్‌ను అభిమానిగా చూసుకునేవారు. కృష్ణంరాజు కోరుకున్న‌ట్లుగానే  ప్ర‌భాస్‌ (Prabhas)  పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ కావాల‌ని డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. 

'స‌లార్' చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడిగా శ్రుతి హాస‌న్ న‌టిస్తున్నారు. జగపతి బాబు, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. క‌న్న‌డ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూరు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 'స‌లార్' చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Read More: ప్ర‌భాస్ (Prabhas) సినిమా స‌లార్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్.. ఏంటంటే

Advertisement
Credits: YouTube

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!