మోస్ట్‌ పాపులర్ తెలుగు సెలబ్రిటీగా ప్రభాస్ (Prabhas)..ఫిమేల్ సెలబ్రిటీ సమంత (Samantha):ఆర్మాక్స్‌ మీడియా సర్వే

Updated on Sep 15, 2022 09:19 PM IST
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు.
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు.

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్‌ ( Prabhas). అప్పటి నుంచి దాదాపుగా అన్నీ పాన్‌ ఇండియా సినిమాలనే చేస్తూ అటు ఫ్యాన్స్‌ను ఇటు సినీ ప్రేమికులను అలరిస్తున్నారు ప్రభాస్. బాహుబలి సిరీస్‌ల తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు సాహో, రాధేశ్యామ్. ఈ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్‌ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లపరంగా కూడా ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. అయితే ప్రభాస్‌ క్రేజ్‌పై వీటి ప్రభావం ఏ మాత్రం పడలేదు.

సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ.. ప్రభాస్‌ మరింత క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా అదే స్పీడ్‌లో వాటిని పూర్తి చేసే పనిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్‌తోపాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కూడా ఉంది. అంతేకాదు ప్రభాస్‌ తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగానే పెంచేశారని, ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.100 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు.

మొదటి స్థానంలో..

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు రూ.120 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ప్రభాస్‌ డిమాండ్‌కి నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారట. ప్రభాస్‌ సినిమాకు హిట్‌ టాక్స్‌ వస్తే రూ.1000 కోట్లు వసూళ్లు తప్పనిసరి అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని సమాచారం. తాజాగా ప్రభాస్‌ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్‌ నటుల్లో మొదటి స్థానంలో నిలిచారు.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా ప్రతినెలా  దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్‌ పొజిషన్‌లో ఉన్న సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఆగస్టు నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్‌ నటీనటుల సర్వే జాబితాను విడుదల చేసింది ఆర్మాక్స్‌ మీడియా. ఈ లిస్టులో హీరోల్లో ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచారు. ప్రభాస్‌ తర్వాతి స్థానాల్లో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, మహేష్‌బాబు ఉన్నారు. హీరోయిన్లలో సమంత (Samantha) తర్వాత కాజల్‌, అనుష్క వరుస ప్లేస్‌ల్లో నిలిచారు.

Read More : ప్రభాస్ (Prabhas) – సందీప్ రెడ్డి ‘స్పిరిట్‌’ సినిమాలో నటించడంపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌‌ క్లారిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!