ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌లో ఊర్మిళా దేవిగా హీరోయిన్ సోనాల్‌ చౌహన్ నటించారా? కామెంట్లు వైరల్

Updated on Sep 18, 2022 05:03 PM IST
ప్రభాస్‌ (Prabhas) సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది
ప్రభాస్‌ (Prabhas) సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి క్యారెక్టర్ పోషించగా.. సీత క్యారెక్టర్‌‌లో కృతిసనన్‌ నటించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌, టీజర్, ట్రైలర్ వంటివి ఏవీ విడుదల కాలేదు. అయినప్పటికీ ఆదిపురుష్‌ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగిన ప్రభాస్‌కు అన్నీ పాన్‌ ఇండియా కథలే వస్తున్నాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అంతేకాదు ఆ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా నిరాశపరిచాయి. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ అప్‌డేట్‌ వస్తుందా అని ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్‌లో వైరల్ అవుతోంది.

ప్రభాస్‌ (Prabhas) సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె సినిమాలు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది

విడుదల ఎలా అంటే..

రామాయ‌ణం నేపథ్యంలో తెర‌కెక్కిన ఆదిపురుష్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సన్నీ సింగ్‌ నిజ్జర్‌‌ లక్ష్మణుడి పాత్ర పోషించారు. కాగా, లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి క్యారెక్టర్‌‌లో టాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాల్ చౌహన్ నటించారు.

సోనాల్ ఆదిపురుష్‌ సినిమాపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్‌కు ముందు.. ఆదిపురుష్‌కు తరువాత.. బాలీవుడ్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే విధంగా సినిమా ఉండబోతోందని చెప్పారు. ఇండియాలోనే అతిపెద్ద సినిమాగా ఆదిపురుష్ విడుదల కానుందని తెలిపారు సోనాల్‌. ఈ కామెంట్లతో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌ సినిమాలో మరో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను టీ -సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆదిపురుష్‌ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల కానుంది. అక్టోబ‌ర్ 3న ఆదిపురుష్‌ సినిమా టీజ‌ర్‌ విడుద‌ల కాబోతున్నట్టు టాక్‌.

Read More : ప్రభాస్ (Prabhas), దళపతి విజయ్‌ సినిమాలతో పోటీకి సై అంటున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!