పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)పై బాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్లు.. ఆయన చాలా గ్రేట్‌ అని పొగడ్తలు

Updated on Jul 26, 2022 07:05 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు

‘బాహుబలి 2’ సినిమాతో రికార్డుల సునామీ సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). దీంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు. బాలీవుడ్ నుంచి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు దర్శకులు. హీరోయిన్లు కూడా ప్రభాస్ పక్కన నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ‘ప్రాజెక్టు కె’ సినిమా చేస్తున్నారు.

ప్రభాస్ కెరీర్‌‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్ట్‌ కె' సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి పరిచయమయ్యారు దిశా పటానీ.

అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయింది. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు దిశా పటానీ. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయిన దిశా.. ప్రభాస్‌పై సంచలన కామెంట్స్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు

చిత్ర యూనిట్ మొత్తానికీ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కొత్త చిత్రం ‘ఏక్ విలన్ 2’ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు దిశా పటానీ. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ప్రభాస్‌పై మీ అభిప్రాయం ఏమిటి అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు. దానికి దిశా పటానీ సమాధానమిస్తూ..‘నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రభాస్‌తో నా మొదటి రోజు షూటింగ్‌ ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు తన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకువచ్చి ఇచ్చారు ప్రభాస్. నా కోసం మాత్రమే కాదు. మా సినిమా టీమ్ మొత్తానికి ప్రభాస్ (Prabhas) ఫుడ్ తీసుకొచ్చారు. ఆయన చాలా గ్రేట్’.. అంటూ చెప్పుకొచ్చారు దిశా పటానీ.

Read More : ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ కోసం ‘సలార్‌‌’ సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!