అమితాబ్‌బచ్చన్‌ (Amitabh Bachchan)కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన ప్రభాస్ (Prabhas) ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్ర యూనిట్

Updated on Oct 13, 2022 12:27 PM IST
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) కీలకపాత్ర పోషిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్‌ కొంత భాగం పూర్తయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కె సినిమాలోని మరో కీలకపాత్రను బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) పోషించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్‌‌ 11వ తేదీ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమితాబ్‌కు అభిమానులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న బిగ్‌ బీకి అభినందనలు చెప్పారు.

స్పెషల్ పోస్టర్‌‌లో..

ప్రాజెక్ట్‌ కె చిత్ర యూనిట్ కూడా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పెషల్‌గా విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ స్పెషల్‌ పోస్టర్‌‌లో ‘లెజెండ్స్ ఆర్‌‌ ఇమ్మోర్టల్స్‌’ అని పోస్టర్‌‌పై రాశారు. లెజెండ్స్‌కు చావు ఉండదు అని దాని అర్థం. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) కీలకపాత్ర పోషిస్తున్నారు.

ప్రభాస్ హీరోగా  ప్రాజెక్ట్ కె సినిమాకు నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం వరకు షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే మరో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని, ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీన్లను చిత్రీకరించనున్నారని టాక్. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో ఈ సీన్లను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

మహాభారతం స్ఫూర్తితో..

మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో ప్రాజెక్ట్‌ కె సినిమా తెరకెక్కుతోందని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కర్ణుడిని పోలిన పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనంత భారీ రేంజ్‌లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉన్న క్యారెక్టర్‌‌ను బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) పోషిస్తున్నారని టాక్. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. 2024లో విడుదల కానున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Read More : బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌పై బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కామెంట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!