బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌పై బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కామెంట్లు

Updated on Jul 18, 2022 01:09 AM IST
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, పూజా హెగ్డే (Pooja Hegde)
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, పూజా హెగ్డే (Pooja Hegde)

పూజా హెగ్డే  (Pooja Hegde) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్నారు పూజ. రణ్‌వీర్‌ సింగ్‌ సరసన 'సర్కస్‌' సినిమాలో నటిస్తున్నారు. వీటితోపాటు పలు సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. సినిమాలతోపాటు పలు వాణిజ్య కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు పూజా. పలు యాడ్స్‌లో కూడా నటిస్తున్నారు.  

తాజాగా పూజా హెగ్డే.. కూల్‌డ్రింక్ మజా యాడ్ చేశారు. ఈ యాడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించారు. ఈ క్రమంలో పూజా.. బిగ్‌ బీ పై కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, పూజా హెగ్డే (Pooja Hegde)

మాటల్లో చెప్పలేను..

అమితాబ్‌ బచ్చన్‌ గారితో కలిసి నటించే చాన్స్ రావడం నా అదృష్టం. నాలాంటి వాళ్లకు ఆయన గురువులాంటి వారు. ఈ వయసులో కూడా బచ్చన్‌ గారి టైమ్ పంక్చువాలిటీ, డెడికేషన్‌ నాకు ఎంతగానో నచ్చాయి. మజా యాడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ గారి మనుమరాలిగా నటించాను. ఆయన మనుమరాలిగా నటిస్తున్న సమయంలో పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను అని చెప్పుకొచ్చారు పూజా హెగ్డే (Pooja Hegde).

Read More : యశ్‌ (Yash) హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్‌ హిట్‌ సినిమా ‘కేజీఎఫ్‌2’ (KGF 2) మరో రికార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!