Adipurush : ఆమిర్ ఖాన్ కోసం ప్ర‌భాస్ (Prabhas) అంత త్యాగం చేశారా!

Updated on Aug 14, 2022 01:37 PM IST
ఆమిర్ ఖాన్ సినిమా కంటే ప్ర‌భాస్ (Prabhas) సినిమా ఆగ‌స్టు 11న రిలీజ్ అయితే బిగ్ హిట్‌గా నిలిచేద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఆమిర్ ఖాన్ సినిమా కంటే ప్ర‌భాస్ (Prabhas) సినిమా ఆగ‌స్టు 11న రిలీజ్ అయితే బిగ్ హిట్‌గా నిలిచేద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

Adipurush: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' ఆగ‌స్టు 11న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజున ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్ర‌భాస్ త‌న సినిమాను వాయిదా వేసుకున్నారు. 'ఆదిపురుష్' వాయిదా వెనుక అస‌లు కార‌ణం ఏంటి?. ఎవ‌రు చెబితే చిత్ర యూనిట్ ఆదిపురుష్ రిలీజ్ తేదీని మార్చారు?. డార్లింగ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?.

ఆమిర్ అడ‌గ‌టంతోనే రిలీజ్ వాయిదా

'ఆదిపురుష్‌'లో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్‌కు జోడిగా సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నారు. 'ఆదిపురుష్' సినిమా నిజానికి ఆగ‌స్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆమిర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' కోసం ఈ సినిమా రిలీజ్‌ను మేక‌ర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఆమిర్ ఖాన్ త‌న సినిమా కోసం 'ఆదిపురుష్' చిత్రం విడుద‌ల తేదీని మార్పు చేసుకోవాల‌ని మేక‌ర్స్‌ను కోరార‌ట‌. ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద హీరో అడ‌గ‌టంతో 'ఆదిపురుష్' నిర్మాత‌లు కాద‌న‌లేక‌పోయారు. దీంతో ఆదిపురుష్ సినిమా విడుద‌ల తేదీలో మార్పు చేశారు. 

ఆమిర్ ఖాన్ సినిమా కంటే ప్ర‌భాస్ (Prabhas) సినిమా ఆగ‌స్టు 11న రిలీజ్ అయితే బిగ్ హిట్‌గా నిలిచేద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. 'రాధేశ్యామ్' తరువాత ప్ర‌భాస్ న‌టించిన సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిల‌వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఆమిర్ ఖాన్ సినిమా కంటే ప్ర‌భాస్ (Prabhas) సినిమా ఆగ‌స్టు 11న రిలీజ్ అయితే బిగ్ హిట్‌గా నిలిచేద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రామాయ‌ణంలోని రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

ప్ర‌భాస్ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 31న‌ 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌భాస్ కూడా 'ఆదిపురుష్' సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ సినిమాను రూ. 500 కోట్ల బడ్జెట్‌తో టీసిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సాచేత్ ప‌రంప‌రం సంగీతం అందిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Read More: Adipurush: ప్ర‌భాస్ (Prabhas) 'ఆదిపురుష్' రిలీజ్ అప్పుడేనంటూ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క్లారిటీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!