Adipurush: 'ఆదిపురుష్' నుంచి అదిరిపోయే అప్‌డేట్!.. ప్ర‌భాస్ (Prabhas) ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

Updated on Sep 09, 2022 01:15 PM IST
Adipurush: 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12 తేదీన  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Adipurush: 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12 తేదీన  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న 'ఆదిపురుష్‌' సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. 'ఆదిపురుష్' చిత్రాన్ని అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని ఓం రౌత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12 తేదీన  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ త‌న సినిమా ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్‌పై హింట్ ఇచ్చారు.

సినిమాల‌తో బిజీగా డార్లింగ్

'బాహుబ‌లి' త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరోగా మారారు. ఆ త‌రువాత వ‌చ్చిన సినిమాలు ఏవీ ప్ర‌భాస్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌లు ఇవ్వ‌లేదు. 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు అభిమానులను నిరాశ ప‌రిచాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 'స‌లార్', 'ప్రాజెక్ట్ కె', 'ఆదిపురుష్' సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల్లో మొద‌టగా 'ఆదిపురుష్' రిలీజ్ కానుంది. 

ఆదిపురుష్‌పై ఓం రౌత్ కామెంట్స్‌

డార్లింగ్ ఫ్యాన్స్ 'ఆదిపురుష్' పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్ర‌భాస్‌కు 'బాహుబ‌లి'కి మించి హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు. 'ఆదిపురుష్' నుంచి ప్ర‌భాస్ లుక్‌ను విడుద‌ల చేయాల‌ని అభిమానులు ఓం రౌత్‌ను కోరుతున్నారు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజున‌ ఫ‌స్ట్ లుక్ మాత్ర‌మే కాద‌ని.. అదిరిపోయే ఓ స‌ర్‌ప్రైజ్ కూడా ఇస్తాన‌ని ఓం రౌత్ చెప్పారు. ఓం రౌత్ చెప్పిన‌ మాట‌ల‌కు డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  

Adipurush: 'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12 తేదీన  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

ప్ర‌భాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని అక్టోబ‌ర్ 23వ తేదిన 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.బాహుబలి కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

Read More: Adipurush : ఆమిర్ ఖాన్ కోసం ప్ర‌భాస్ (Prabhas) అంత త్యాగం చేశారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!