నార్త్‌లో చిరంజీవి (Chiranjeevi Konidela) ‘గాడ్‌ఫాదర్’ (GodFather) హవా.. 600 స్క్రీన్లు పెంపు

Updated on Oct 08, 2022 03:40 PM IST
హిందీ ఆడియెన్స్ మంచి ఆదరణ చూపిస్తుండటంతో ఉత్తరాదిన ‘గాడ్ ఫాదర్’ (GodFather) సినిమాకు మరిన్ని స్క్రీన్స్‌ను పెంచారు
హిందీ ఆడియెన్స్ మంచి ఆదరణ చూపిస్తుండటంతో ఉత్తరాదిన ‘గాడ్ ఫాదర్’ (GodFather) సినిమాకు మరిన్ని స్క్రీన్స్‌ను పెంచారు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) చిత్రం దసరా కానుకగా ఈనెల 5న విడుదలైంది. మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కు తగ్గ సినిమా రావడంతో ఆయన ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ‘గాడ్‌‌ఫాదర్‌’ మంచి వసూళ్లను రాబడుతోంది.

హిందీ ఆడియెన్స్ నుంచి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ రావడంతో ఉత్తరాదిన ‘గాడ్ ఫాదర్’కు స్క్రీన్స్‌ను పెంచారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసిన చిరు.. నార్త్‌లో ‘గాడ్ ఫాదర్’కు 600 స్క్రీన్స్‌ను పెంచామన్నారు. ఈ చిత్రంపై అభిమానాన్ని చూపుతున్న ప్రేక్షకులందరికీ చిరు కృతజ్ఞతలు చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. 

‘గాడ్ ఫాదర్’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం విడుదలైన రెండ్రోజుల్లోనే రూ.69 కోట్ల వసూళ్లను రాబట్టినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు (అక్టోబర్‌ 8) నుంచి హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ను పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా చేసిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.  

వసూళ్లలో తగ్గని జోరు

వసూళ్ల పరంగా చూసుకుంటే.. తొలిరోజు చిరంజీవి స్థాయికి కాస్త తక్కువ వసూళ్లు సాధించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం.. రెండో రోజు మాత్రం స్ట్రాంగ్ కలెక్షన్స్‌ను నమోదు చేసింది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం సహజమే. కానీ హిట్ టాక్ వచ్చినా.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు 20 నుంచి 30 శాతం వరకు వసూళ్లు పడిపోతాయి. కానీ ‘గాడ్‌‌ఫాదర్‌’ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ను సాధించింది. 

‘గాడ్‌‌ఫాదర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజున మంచి స్పీడ్ కనబర్చిన ఈ సినిమా.. రూ. 31 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ.69 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఈ వారాంతంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. హిట్‌ టాక్‌ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండటం ఈ చిత్రానికి కలిసొస్తోంది. అయితే సోమవారం నుంచి సినిమాకు కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. మరి, ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రం ఎంత పెద్ద హిట్టుగా నిలుస్తుందో చూడాలి!

Read more: ‘బాస్ ఈజ్ బ్యాక్’.. రెండో రోజు మంచి వసూళ్లు సాధించిన ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) మూవీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!