మలయాళ సినిమా ‘భీష్మ పర్వ’ రీమేక్ చేసే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)!

Updated on Oct 08, 2022 02:03 PM IST
మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసిఫర్‌‌’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన గాడ్‌ఫాదర్ హిట్‌ టాక్ సాధించింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హిట్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్య పెంచుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం భోళాశంకర్‌‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు చిరు. ఈ సినిమా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరంజీవికి చెల్లెలి క్యారెక్టర్‌‌ను కీర్తి సురేష్‌ పోషిస్తున్నారు.

ఈ సినిమా కాకుండా వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాలోని మరో కీలక పాత్రను మాస్ మహారాజా రవితేజ పోషిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

రైట్స్ సొంతం చేసుకున్న..

మలయాళ సినిమా రీమేక్‌తో భారీ హిట్‌ అందుకున్న చిరంజీవి.. మరో మలయాళీ సినిమాపై కూడా చిరు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరో మలయాళీ సూపర్ హిట్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘భీష్మ పర్వ’ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారని టాక్. ఈ సినిమా హక్కులను మెగాపవర్‌‌స్టార్‌‌ రాంచరణ్ ఇప్పటికే దక్కించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన కూడా రానుందని టాక్. అదే నిజమైతే చిరంజీవి (Chiranjeevi)ని మరో పవర్‌‌ఫుల్ క్యారెక్టర్‌‌లో చూడవచ్చని అభిమానులు సంబరపడుతున్నారు. 

Read More : మరో రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా! డైరెక్టర్‌‌ను కూడా ఓకే చేశారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!