‘బాస్ ఈజ్ బ్యాక్’.. రెండో రోజు మంచి వసూళ్లు సాధించిన ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) మూవీ

Updated on Oct 07, 2022 02:45 PM IST
రెండో రోజు ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు
రెండో రోజు ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌‌ఫాదర్‌’ (GodFather) చిత్రం దసరా కానుకగా ఈనెల 5న విడుదలైంది. మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కు తగ్గ సినిమా రావడంతో ఆయన ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ‘గాడ్‌‌ఫాదర్‌’పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 

తొలిరోజు చిరంజీవి స్థాయికి కాస్త తక్కువ వసూళ్లు సాధించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం.. రెండో రోజు మాత్రం స్ట్రాంగ్ కలెక్షన్స్‌ను నమోదు చేసింది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం సహజమే. కానీ హిట్ టాక్ వచ్చినా.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు 20 నుంచి 30 శాతం వరకు వసూళ్లు పడిపోతాయి. కానీ ‘గాడ్‌‌ఫాదర్‌’ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ను సాధించింది. 

‘గాడ్‌‌ఫాదర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజున మంచి స్పీడ్ కనబర్చిన ఈ సినిమా.. రూ. 31 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ.69 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండటంతో వారాంతంలోగా ఈ మూవీ అలవోకగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నార్త్‌లో థియేటర్ల పెంపు కలిసొస్తుందా?

‘గాడ్‌‌ఫాదర్‌’ చిత్రానికి చాలాచోట్ల థియేటర్లు ఎక్కువగా దొరకలేదు. ముఖ్యంగా నార్త్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘విక్రమ్ వేద’ వల్ల ‘గాడ్ ఫాదర్’కు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈరోజు నుంచి ‘విక్రమ్ వేద’ మూవీని తొలగించి.. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా నటించిన ‘గుడ్ బై’ సినిమాలను ప్రదర్శించనున్నారు. ‘గాడ్ ఫాదర్’ మూవీలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేయడంతో ఉత్తరాది ప్రేక్షకులు, సల్లూ భాయ్ అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. మరి, నార్త్‌లో ఈ మూవీకి కలెక్షన్లు ఊపందుకుంటాయేమో చూడాలి. 

కాగా, మోహన్ రాజా తెరకెక్కించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించారు. హీరోయిన్ న‌య‌న‌తార‌తోపాటు సునీల్, బ్ర‌హ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ‘మ‌సూద్ భాయ్’ అనే పాత్ర‌లో న‌టించారు. గాడ్‌ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు.

Read more: ‘ఆచార్య’ (Acharya) కంటే తక్కువ కలెక్షన్స్!.. ‘గాడ్‌ఫాదర్’ (GodFather) తొలిరోజు వసూళ్లు ఎంతంటే..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!