చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్ న్యూస్.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) రిలీజ్ డేట్ ఫిక్స్

Updated on Dec 07, 2022 04:59 PM IST
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విడుదల తేదీపై అప్‌డేట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విడుదల తేదీపై అప్‌డేట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది

‘గాడ్ ఫాదర్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘క్రాక్’ విజయంతో ఊపుమీదున్న దర్శకుడు బాబీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఏ తేదీన రిలీజ్ అవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విడుదల తేదీపై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. 

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. పదమూడో తేదీన మాస్ మూలవిరాట్ దర్శనమిస్తారని చెబుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఓ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. బోటులో నిల్చున్న చిరంజీవి, ఆయన చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకోవడాన్ని ఈ కొత్త పోస్టర్‌లో చూడొచ్చు. ఇందులో చాలా ఇంటెన్సివ్‌గా కనిపించారు. 

చిరు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. తమ హీరో పండక్కి వస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే, ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ నుంచి విడుదలైన ‘బాస్ పార్టీ’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కనిపించింది. ఆ పాటలో చిరు, ఊర్వశి రౌటేలా కలసి వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

కాగా, సంక్రాంతి రేసులో మరికొన్ని చిత్రాలు కూడా ఉండటంతో థియేటర్ల సమస్య తప్పేలా లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ పండుగకే రిలీజ్ కానుంది. తమిళ స్టార్ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ కూడా పొంగల్ బరిలోకి తమ సినిమాలను నిలుపుతున్నారు. ‘వీరసింహారెడ్డి’, ‘వారసుడు’ చిత్రాలు ఒకేరోజు (జనవరి 12)న విడుదల కానున్నాయి. మరి, ఈ పోటీలో ఏయే చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతాయో చూడాలి. 

Read more: TFCC: తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్​ కామర్స్ లేఖ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!