Bhola Shankar: చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న "భోళా శంకర్" సినిమా టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !
Bhola Shankar: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరు నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకెళుతోంది. చిరంజీవి తన 155 వ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ సినిమాకు 'భోళా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్‌గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. చెల్లెలు సెంటిమెంట్‌తో 'భోళా శంకర్' కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానున్న 'భోళా శంకర్' సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు తెలుసుకుందాం.
1. రీమేక్ సినిమా
2015లో విడుదలైన తమిళ సినిమా 'వేదాళం'ను తెలుగులో 'భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. తమిళ భాషలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. 'వేదాళం' సినిమా తమిళ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను 2018లో బెంగాళీ భాషలో 'సుల్తాన్'గా రీమేక్ చేశారు.
2. చిరంజీవి రెమ్యునరేషన్
చిరంజీవి (Chiranjeevi) ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట. 'ఆచార్య' సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకున్నారట. 'భోళా శంకర్' చిత్రానికి రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇదే నిజమైతే తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చిరంజీవి బీట్ చేసినట్టే. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
3. చెల్లి పాత్రలో మహానటి
'భోళా శంకర్' సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ముందుగా చిరు చెల్లెలు పాత్రకు సాయిపల్లవిని సంప్రదించారు. సాయిపల్లవి చిరంజీవికి చెల్లెలుగా నటించేందుకు ఒప్పుకోకపోవడంతో కీర్తి సురేష్‌ను అడిగారట. 'భోళా శంకర్' చెల్లెలు సెంటిమెంట్ సినిమా. ఈ సినిమాలో కీర్తి చిరంజీవికి సొంత చెల్లులు కాదట. కీర్తి సురేష్‌ను రక్షించే క్రమంలో చెల్లెలని చిరు చెబుతారట.
4. చిరుతో తమన్నా
'సైరా నరసింహారెడ్డి' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తమన్నా నటించారు. 'సైరా'లో చిరు, తమన్నాల నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమాగా 'భోళా శంకర్' విడుదల కానుంది.
5. ఓ రేంజ్‌లో చిరు ఫైట్స్
మొదటి షెడ్యూల్‌లోనే దర్శకుడు మెహర్ రమేష్ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారని సమాచారం. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్‌లు కలిసి చిరంజీవితో యాక్షన్ సీన్స్ చేయించారట. ఫైట్ సీన్స్ కోసం భారీ సెట్స్ కూడా ఏర్పాటు చేశారు. 'ఆచార్య' సినిమా ఫ్లాపుతో ఇటు చిరంజీవి.. అటు మెగా ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇకపై చిరంజీవి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించేలా దర్శకులు ప్రయత్నిస్తున్నారు. మెహర్ రమేష్ కూడా అదే బాటలో కొనసాగుతున్నారు.
6. సంగీతం మరో ప్లస్ కానుందా!
ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు. రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందిస్తున్నారు.
7. కమర్షియల్ హంగులతో భోళా శంకర్ - నిర్మాత
భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 'భోళాశంకర్ సినిమా చెల్లెలు సెంటిమెంట్ సినిమా అయినా.. అభిమానులకు కావాల్సిన కమర్షియల్ హంగులను... దర్శకుడు మెహర్ రమేష్ వెండితెరపై చూపించనున్నారని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
8. ఏడేళ్ల తరువాత డైరెక్షన్ చేయనున్న దర్శకుడు
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో రిలీజ్ అయిన కంత్రి, బిల్లా చిత్రాలు బ్లాక్ బాస్టర్‌గా నిలిచాయి. ఇక ఏడేళ్ల తరువాత మెహర్ రమేష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదీ కూడా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్‌ను భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. చిరంజీవికి దర్శకుడు మెహర్ రమేష్ బంధువవుతారు. చిరంజీవికి ఈ దర్శకుడు ఎలాంటి హిట్ అందిస్తారో చూడాలి.
9. మరో హీరోనా!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మరో స్టార్ హీరోకు అవకాశం కల్పిస్తున్నారు. ఆచార్యలో రామ్ చరణ్, గాడ్ ఫాదర్‌కు సల్మాన్, వాల్తేర్ వీరయ్యకు రవితేజలను తీసుకున్నారు. భోళాశంకర్ సినిమాలో కూడా మరో యంగ్ హీరో కచ్చితంగా నటిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నితిన్ నటిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ హీరో చిరుతో కలిసి వెండితెరపై సందడి చేయనున్నారో చూడాలి.
10. రిలీజ్ ఎప్పుడంటే
'భోళాశంకర్' సినిమాను 2023లో ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.