‘ధమాకా’ (Dhamaka) మూవీ నుంచి మరో అప్‌డేట్.. ‘వాట్స్ హ్యాపెనింగ్’ అంటున్న మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)!

Updated on Nov 12, 2022 01:24 PM IST
‘సింగిల్‌గానే ఉంటా.. ఏ లవ్‌లో పడకుండా’ అంటూ సాగే ఈ పాటలో రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) మధ్య రొమాన్స్ ఆకట్టుకుంటోంది
‘సింగిల్‌గానే ఉంటా.. ఏ లవ్‌లో పడకుండా’ అంటూ సాగే ఈ పాటలో రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) మధ్య రొమాన్స్ ఆకట్టుకుంటోంది

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సినిమాల కోసం ఆయన అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కథ, కథనాల విషయం పక్కనబెడితే మినిమం ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆయన చిత్రాల నుంచి ఆశించొచ్చు. అయితే ఈ మధ్య రవితేజకు సరైన హిట్లు పడలేదు. ఆయన నటించిన గత సినిమాలు ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు. 

‘క్రాక్’ సినిమాతో విక్టరీ కొట్టిన రవితేజ అదే ఊపును కొనసాగించడంలో విఫలమయ్యారు. ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ పరాజయం పాలవ్వడంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారు. త్వరలో మరో మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. రవితేజ నటించిన ‘ధమాకా’ (Dhamaka) చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) యాక్ట్ చేస్తున్నారు. 

నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ‘ధమాకా’ ఫిల్మ్‌ను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ–అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ బాణీలు సమకూర్చుతున్నారు. ఇంతవరకు రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘వాట్స్ హ్యాపెనింగ్’ అనే మరో సాంగ్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది.  ‘సింగిల్‌గానే ఉంటా.. ఏ లవ్‌లో పడకుండా అని అనుకున్న మాట ఏమయ్యిందో’ అంటూ ఈ పాట నడుస్తుంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్‌ను రమ్యా బెహ్రా, భార్గవీ పిళ్లై ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ యూబ్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. 

ఇకపోతే, రవితేజ నాలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ఒకటి ‘ఈగల్’. హాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘జాన్‌విక్‌’ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని వినికిడి. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ‘ఈగల్’ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న చిత్రం షూటింగ్‌ పోలండ్‌లో జరుగుతోందని సమాచారం. ‘ఈగల్’ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌‌ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Read more: ప్రభాస్ (Prabhas) @ 20 ఇయర్స్ ఇండస్ట్రీ - ప్రభాస్ ను అభిమాన ప్రశంసలతో తడిసేలా చేసిన వర్షం చిత్రం టాప్ 10 విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!