‘ధమాకా’ (Dhamaka) నుంచి “దండకడియాల్” (Danda kadiyal) లిరికల్ సాంగ్ రిలీజ్.. దుమ్ము రేపుతున్న మాస్ బీట్!

Updated on Dec 08, 2022 12:59 PM IST
భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)  స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు.
భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)  స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు.

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘ధమాకా’ (Dhamaka). ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల (Sree leela) కథానాయికగా నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ (Dhamaka Movie) ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 

ఈ మేరకు తాజాగా “దండకడియాల్” (Danda kadiyal) అంటూ సాగే ప్రోమో సాంగ్‌ను మేకర్స్‌ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో’ అంటూ ఈ పాట సాగుతోంది. జానపద బాణీలో జోరుగా నడిచే ఈ పాటను భీమ్స్ కంపోజ్ చేశారు. తాజాగా ఈ సాంగ్ పూర్తి లిరికల్ సాంగ్ విడుదలయింది. ఇందులో రవితేజ, శ్రీలీల వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్స్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి.

భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)  స్వర పరిచిన ఈ పాటను భీమ్స్‌తో పాటు సాహితి, మంగ్లీ ఆలపించారు. అంతేకాకుండా ఈ పాటకు భీమ్స్‌ స్వయంగా సాహిత్యం అందించాడు. జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో జోరుగా మొదలైన ఈ పాట, కొంతదూరం వెళ్లిన తరువాత ఊపు తగ్గిందేమో అనిపిస్తుంది. కాగా, ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: 'మెగా154' (Mega154) లో 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి (Chiranjeevi).. 'వైజాగ్ రంగరాజు'గా రవితేజ (Raviteja)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!