నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో 'NBK108' అధికారిక ప్రకటన వచ్చేసింది.. రేపే ముహూర్తం!

Updated on Dec 07, 2022 02:30 PM IST
‘NBK108’ (వర్కింగ్ టైటిల్) చిత్రం రేపు(గురువారం) లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
‘NBK108’ (వర్కింగ్ టైటిల్) చిత్రం రేపు(గురువారం) లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి, ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌2’ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. ఇప్పుడు మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. 

‘NBK108’ (వర్కింగ్ టైటిల్) చిత్రం రేపు(గురువారం)ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 9:36గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా రేపటి నుంచే ప్రారంభం కానుందట. అందుకోసం భారీ సెట్‌ వేశారని సమాచారం. 

ఈ సినిమాకు నేపథ్య సంగీతం తమన్‌ అందిస్తున్నారట. బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని లుక్‌లో చూపిస్తానని గతంలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెప్పిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యుల్ తర్వాత బాలకృష్ణ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజక్టును సాహూ గారాపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2023వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇందులో బాలయ్యకి జోడీగా ప్రియాంక జవాల్కర్‌ (Priyanka Jawalkar) నటిస్తుందట. అలాగే ప్రియమణి కూడా ఆయన సరసన కనిపించబోతుందని సమాచారం. దీంతోపాటు నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో అంజలి నటించనున్నారట. ఇలా సినిమా మొత్తం హీరోయిన్లతో నింపేయబోతున్నారు అనిల్‌ రావిపూడి. గ్లామర్‌ డోస్‌ గట్టిగానే మేళవిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌ టాక్‌.

Read More: గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అఖండ' (Akhanda) హంగామా.. హాజరైన బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!