మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటిస్తున్న ‘ఈగల్‌’ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు!

Updated on Oct 30, 2022 11:48 PM IST
మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎదిగారు రవితేజ (RaviTeja). యూత్‌ను అలరించే సినిమాలు చేస్తూనే మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరై మాస్‌ మహారాజా అయ్యారు. ఇటీవల రవితేజ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. క్రాక్ సినిమా తర్వాత ఆయన రేంజ్‌కు తగిన హిట్‌ రాలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అంతేకాదు, వరుసగా కొత్త సినిమాలను ఓకే చేస్తూ స్పీడ్ పెంచేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి ఈగల్. హాలీవుడ్‌ సినిమా జాన్‌విక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈగల్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగ్‌ పోలండ్‌లో జరుగుతోందని సమాచారం. ఈగల్ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌‌ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్‌‌గా మారనున్నారు. ఇదిలా ఉండగా.. ఈగల్ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది.

మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

సినిమా హిట్‌తో..

ఈగల్ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు యంగ్ హీరోయిన్లు నటించనున్నట్టు తెలుస్తోంది. అ..ఆ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్. ఇటీవల ‘కార్తికేయ2’తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో అనుపమ క్రేజ్‌ కూడా బాగానే పెరిగింది. ఈగల్ సినిమాలో రవితేజ సరసన అనుపమ హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.

ఇక, ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్నారు కావ్యా తప్పర్. ఆ సినిమాలో నటనకు మంచి పేరు తెచ్చుకున్న కావ్యా కూడా ఈగల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారని టాక్. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతోపాటు ఈగల్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న రవితేజ (RaviTeja).. ఈ సినిమాలతోనైనా హిట్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Read More : ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ సాంగ్‌తో అలరించనున్న చిరంజీవి (Chiranjeevi), రవితేజ (RaviTeja).. ఫ్యాన్స్‌కు జాతరే ఇక

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!