మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ‘ధ‌మాకా’ మూవీ నుంచి రిలీజ్ కానున్న రొమాంటిక్ గ్లింప్స్‌ (Dhamaka Glimpse)..!

Updated on Aug 30, 2022 12:33 PM IST
‘ధ‌మాకా’ మూవీ నుంచి రొమాంటిక్ గ్లింప్స్‌ను (Dhamaka Romantic Glimpse) బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
‘ధ‌మాకా’ మూవీ నుంచి రొమాంటిక్ గ్లింప్స్‌ను (Dhamaka Romantic Glimpse) బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

టాలీవుడ్ మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను ఓకే చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు అనుకున్నంత పాజిటివ్‌గా రాలేదు. దీంతో రవితేజ అభిమానులు తీవ్రంగా నిరాశచెందారు.

‘ఖిలాడీ’ (Khiladi), ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) రెండు సినిమాల ఫలితాలు రవితేజను కూడా పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో రవితేజ తన తర్వాతి సినిమాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. వాటిలో ‘ధమాకా’ ఒకటి. ‘నేను లోకల్’ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

ఇప్పటికే 'ధమాకా' (Dhamaka) సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ధమాకా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు మేకర్స్. ‘ధ‌మాకా’ మూవీ నుంచి రొమాంటిక్ గ్లింప్స్‌ను (Dhamaka Romantic Glimpse) బుధ‌వారం సాయంత్రం 5.01 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ర‌వితేజ‌కు జోడీగా పెళ్ళి సంద‌D ఫేం శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా న‌టిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్ర‌సన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు అందిస్తున్నాడు.

Read More: Tiger Nageswara Rao : రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో.. అనుపమ్ ఖేర్‌కు కీలక పాత్ర !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!