‘NBK108’: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన అనిల్ రావిపూడి-బాలకృష్ణ మూవీ.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్!

Updated on Dec 08, 2022 02:33 PM IST
బాలకృష్ణ-అనిల్ రావిపూడి (Ani Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో  అట్టహాసంగా ప్రారంభమైంది.
బాలకృష్ణ-అనిల్ రావిపూడి (Ani Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో  అట్టహాసంగా ప్రారంభమైంది.

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓ వైపు వీరసింహారెడ్డి, మరోవైపు ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌2’ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడితో తన కెరీర్ లో 108వ సినిమాని ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి (Ani Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో  అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనేక మంది సినీ ప్రముఖుల మధ్య జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 

‘NBK108’ (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించడానికి రెడీ అవుతున్నాడు.

‘ఎఫ్ 3’ మూవీ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నేటి నుంచే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ భారీ జైలు సెట్ లో అదిరే యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కానున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల (Sree Leela) నటించబోతుంది అని ఇప్పటికే అనిల్ కన్ఫర్మ్ చేసేసాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read More: నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో 'NBK108' అధికారిక ప్రకటన వచ్చేసింది.. రేపే ముహూర్తం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!