మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' (Dhamaka) సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. డిసెంబర్ 15న ట్రైలర్ రిలీజ్!

Updated on Dec 11, 2022 12:07 PM IST
వింటేజ్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' (Dhamaka) చిత్రాన్ని ప్లాన్ చేయగా రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు.
వింటేజ్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' (Dhamaka) చిత్రాన్ని ప్లాన్ చేయగా రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు.

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా, శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ధమాకా' (Dhamaka). యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ (Dhamaka Movie) ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

ఓ వింటేజ్ ఎంటర్టైనర్ గా 'ధమాకా' (Dhamaka) చిత్రాన్ని ప్లాన్ చేయగా రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు. మరి ఈ చిత్రం నుంచి తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని అయితే ఈ డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టుగా మాస్ మహారాజ స్టైలిష్ పోస్టర్ తో తెలిపారు. ఇందులో రవితేజ చేస్తున్న మరో పాత్రపై ఈ పోస్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్‌రాజ ‘క్రాక్‌’తో గ్రాండ్‌ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది రిలీజైన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్‌ అవడంతో తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ‘ధమాకా’ (Dhamaka) సినిమా పైనే ఉన్నాయి.

Read More: Ravi Teja : రవితేజ చేసే మరో మాస్ హంగామా "ధమాకా" (Dhamaka) .. ఈ సినిమా గురించి టాప్ 10 విశేషాలు మీకోసం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!