Ravi Teja : రవితేజ చేసే మరో మాస్ హంగామా "ధమాకా" (Dhamaka) .. ఈ సినిమా గురించి టాప్ 10 విశేషాలు మీకోసం !

Updated on Sep 24, 2022 05:41 PM IST
రవితేజ (Ravi Teja).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ మహారాజాగా అభిమానుల చేత కితాబునందుకున్న సినీ కథానాయకుడు.
రవితేజ (Ravi Teja).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ మహారాజాగా అభిమానుల చేత కితాబునందుకున్న సినీ కథానాయకుడు.

రవితేజ (Ravi Teja).. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా సుపరిచితుడైన సినీ కథానాయకుడు. వెంకీ, విక్రమార్కుడు, రాజా ది గ్రేట్, క్రాక్, కిక్ లాంటి సినిమాలతో ఈయన రియల్ మాస్ హీరోగా తనకంటూ ఒక సుస్థిరమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. 

ఇటీవలి కాలంలో రవితేజ సైన్ చేసిన సినిమా పేరే "ధమాకా". విడుదలకు ముందే అభిమానులకు, ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా, మనం కూడా ఈ చిత్రం గురించిన టాప్ 10 విశేషాలు తెలుసుకుందామా

అనకాపల్లి కుర్రాడి డైరెక్షన్‌లో
సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో, మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా వస్తున్న సినిమాయే ఈ "ధమాకా" . త్రినాథరావు అనకాపల్లి వాస్తవ్యులు. తొలుత ఈయన ఈటీవీ సీరియల్స్‌కి దర్శకత్వం వహించేవారు. 

కోరైటర్‌గా ప్రసన్న కుమార్ బెజవాడ
రన్, నేను లోకల్ లాంటి సినిమాలకు సంభాషణలు వ్రాసిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకు కూడా కోరైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "దాస్ కా దమ్కీ" (Das Ka Dhamki) చిత్రానికి కూడా ఈయనే కథా సహకారాన్ని అందిస్తున్నారు. 

శ్రీలీలకు రియల్ మాస్ ఆఫర్
శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా తెరకెక్కిన "పెళ్లిసందడి"తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల (Sree Leela), ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల అంతముందే కన్నడంలో కిస్, భారతే లాంటి హిట్ సినిమాలలో నటించడం విశేషం. 

భీమ్స్ మ్యూజిక్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
ఓ పదిహేనేళ్ళ క్రితం "ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే" లాంటి సూపర్ హిట్ సాంగ్‌‌తో  టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన రచయిత, గాయకుడు భీమ్స్ సిసిరోలియో "ధమాకా" (Dhamaka) చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలా ఎలా, గరుడవేగ, కెవ్వు కేక లాంటి సినిమాలకు కూడా భీమ్స్ గతంలో మ్యూజిక్ అందించారు. 

రవితేజ (Ravi Teja).. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ మహారాజాగా అభిమానుల చేత కితాబునందుకున్న సినీ కథానాయకుడు.

కార్తిక్ సినిమాటోగ్రఫీ
కార్తికేయ, కార్తికేయ 2, ప్రేమమ్, అ, చిత్రలహరి లాంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించిన కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) "ధమాకా" చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. 

ప్రవీణ్ పూడి ఎడిటింగ్
శ్రీకర్ ప్రసాద్, మార్తాండ్ కె వెంకటేష్ లాంటి ఉద్ధండుల వద్ద అప్రంటీస్‌గా పనిచేసిన ప్రవీణ్ పూడి (Praveen Pudi) "ధమాకా" చిత్రానికి కూడా కూర్పరిగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ గతంలో పిల్ల జమిందార్, అత్తారింటికి దారేదీ, మనం, ఒక లైలా కోసం, సన్నాఫ్ సత్యమూర్తి, వకీల్ సాబ్ లాంటి హిట్ సినిమాలకు ఎడిటర్‌‌గా పనిచేశారు.

"కార్తికేయ 2" ప్రొడ్యూసర్ల ప్రాజెక్టు
నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా "కార్తికేయ 2" లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్‌లు "ధమాకా" చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. అభిషేక్ అగర్వాల్ గతంలో "కాశ్మీర్ ఫైల్స్" చిత్రానికి కూడా సహ నిర్మాతగానూ వ్యవహరించారు.

జబర్దస్త్ స్కిట్స్ ఉంటాయా?
ఈ సినిమాలో హైపర్ ఆదితో కొన్ని జబర్దస్త్ స్కిట్స్ చేయించే అవకాశం ఉందని పలు పత్రికలు వార్తలు రాశాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

హుషారెక్కిస్తున్న మాస్ పాటలు
ఈ సినిమాలో "జింతాక్" అనే మంచి హుషారెత్తించే గీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా.. మంగ్లీ, భీమ్స్ ఈ పాటను ఆలపించారు. "విక్రమార్కుడు" చిత్రంతో పాపులరైన "జింతాక్" గీతానికి కొత్త వెర్షన్ ఇది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు.  అలాగే మరో మాస్ మసాలా సాంగ్ "మాస్ రాజా"ను రామజోగయ్య శాస్త్రి రాయగా, నఖాష్ అజీజ్ ఆలపించారు. 

స్పెయిన్‌లో షూటింగ్
"ధమాకా" చిత్రంలోని చాలా భాగం షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది.  అలాగే హైదరాబాద్‌లో కూడా పలు చోట్ల ఈ సినిమా షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు మేకర్స్. 

ఇవండీ.. "ధమాకా" సినిమాకి సంబంధించిన ముచ్చట్లు  !

Read More: హీరోగా రవితేజ (Ravi Teja) తమ్ముడి కొడుకు ఎంట్రీ.. దర్శకుడు రమేష్‌ వర్మపైనే భారం వేసిన మాస్‌ మహరాజా!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!