‘వారసుడు’ (Vaarasudu) మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థమన్ మ్యూజిక్‌కు విజయ్ (Vijay) మార్క్ స్టెప్స్! 

Updated on Nov 04, 2022 10:56 AM IST
రంజితమే సాంగ్‌లో థమన్ మార్క్ మ్యూజిక్‌కు, దళపతి విజయ్ (Vijay) తనదైన డ్యాన్స్ మూవ్స్‌తో అలరించారు
రంజితమే సాంగ్‌లో థమన్ మార్క్ మ్యూజిక్‌కు, దళపతి విజయ్ (Vijay) తనదైన డ్యాన్స్ మూవ్స్‌తో అలరించారు

దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్టు ‘వరిసు’ (Varisu). ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ (Vaarasudu)గా తీసుకొస్తున్నారు. ఇది ద్విభాషా చిత్రమని.. తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందిస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా పక్కా తమిళ మూవీ అని వంశీ పైడిపల్లి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 

‘వారసుడు’ నుంచి ఫస్ట్ సాంగ్ రంజితమే (Ranjithame Song) ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తమిళ వెర్షన్ రంజితమే పాట ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమోలో విజయ్ తనదైన డ్యాన్స్ మూవ్స్‌తో అలరించారు. దీంతో ఫుల్ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఆయన ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. 

‘వారసుడు’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూర్చుతున్న ‘వారసుడు’ను.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

తెలుగులోనూ ‘వారసుడు’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయ్‌కు ఇక్కడా మార్కెట్ పెరిగింది. ‘తుపాకీ’, ‘పోలీసోడు’, ‘స్నేహితుడు’, ‘సర్కార్’. ‘అదిరింది’, ‘విజిల్’, ‘మాస్టర్’ చిత్రాలు తెలుగునాట మంచి వసూళ్లు సాధించాయి. దీంతో ‘వారసుడు’ సినిమాను టాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. 

ఇకపోతే, ‘వారసుడు’ (Vaarasudu) తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నారు. ఇది ఆయనకు 67వ చిత్రం కానుంది. లోకేష్ ఈ సినిమాను లావిష్‌గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక, విజయ్ 68వ ఫిల్మ్ గురించి ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ బ్యానర్‌లో చేయడానికి దళపతి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీస్ (Mythri Movies) నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు వినికిడి. 

Read more: Avatar : The Way of Water : "అవతార్ 2" సినిమా టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!